బ్రేకింగ్‌.. నాసిక్‌లో భూప్రకంపనలు

మహారాష్ట్రలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. మంగళవారం మధ్యాహ్నం 2.54 గంటలకు నాసిక్‌ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 2.2 మాగ్నిట్యూడ్‌గా..

బ్రేకింగ్‌.. నాసిక్‌లో భూప్రకంపనలు

Edited By:

Updated on: Aug 18, 2020 | 6:38 PM

మహారాష్ట్రలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. మంగళవారం మధ్యాహ్నం 2.54 గంటలకు నాసిక్‌ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 2.2 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. నాసిక్‌కు పడమరన 88 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని నేషనల్‌ సెంటర్‌ ఫర్ సిస్మాలజీ తెలిపింది.

ఇదిలావుంటే.. ఇప్పటికే ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు భారీ వర్షాలు కూడా ముంబైలోని అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. గతంలో కూడా పాల్‌ఘర్‌ ప్రాంతంలో స్వల్ప భూకంపం సంభవించింది. దీంతో ఎలాంటి నష్టం జరగలేదు.

Read More :

మేఘాలయకు బదిలీ అయిన గోవా గవర్నర్

బ్రెజిల్‌లో 33 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు