సుశాంత్ సింగ్ కి ఆర్ధిక కష్టాలే లేవు, ఈడీ

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి ఆర్ధిక కష్టాలేవీ లేవని ఈడీ వర్గాలు తెలిపాయి. రెండు మూడేళ్ళలో ఆయన వివిధ ప్రాజెక్టుల ద్వారా 30 నుంచి 35 కోట్ల వరకు సంపాదించాడని..

సుశాంత్ సింగ్ కి ఆర్ధిక కష్టాలే లేవు, ఈడీ

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి ఆర్ధిక కష్టాలేవీ లేవని ఈడీ వర్గాలు తెలిపాయి. రెండు మూడేళ్ళలో ఆయన వివిధ ప్రాజెక్టుల ద్వారా 30 నుంచి 35 కోట్ల వరకు సంపాదించాడని ఈ వర్గాలు వెల్లడించాయి. సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయంతి సాహా ఇచ్చిన  వాంగ్మూలాన్ని బట్టి దీన్ని వారు ధృవీకరించారు. సుశాంత్ బ్యాంకు డాక్యుమెంట్లు, ఇతర స్టేట్ మెంట్లు కూడా ఇందుకు నిదర్శనంగా నిలిచాయని ఈడీ అధికారులు తెలిపారు. అలాగే సుశాంత్ పెట్టిన వ్యయాలు, పెట్టుబడుల పైనా ఈ సంస్థ దృష్టి సారించింది. ఈ నటుని చార్దర్డ్ అకౌంటెంట్ సందీప్ శ్రీధర్ ని కూడా తాము విచారించనున్నామని వారు వెల్లడించారు.

ఇక సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి సంబంధించిన ఆదాయపు పన్ను పత్రాలను, ఇన్వెస్ట్ మెంట్ డాక్యుమెంట్లను ఆమె టాక్స్ కన్సల్టెంట్ రితేష్ మోడీ..ఈడీకి అందజేశారు. రియాను, ఆమె కుటుంబ సభ్యులను, ఆమె మాజీ మేనేజర్ శృతి మోడీ, శామ్యూల్ మిరందాలను ఇంకా ఇంటరాగేట్ చేస్తున్నారు.

 

Click on your DTH Provider to Add TV9 Telugu