MiG-21 crashes: భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 బైసన్ విమానం బుధవారం ఉదయం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ గ్రూప్ కెప్టెన్ ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ ఇండియాలోని ఓ వైమానిక స్థావరం నుంచి రోజువారీ శిక్షణలో భాగంగా బయల్దేరిన విమానం.. కొద్దిసేపటికే ప్రమాదానికి గురై కుప్పకూలింది. ఈ ఘటనలో గ్రూప్ కెప్టెన్ ఎ. గుప్త మృతి చెందినట్టు ఐఏఎఫ్ వెల్లడించింది. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రకటనను విడుదల చేసింది. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్‌ను షేర్ చేసింది.
ఈ ఘోర ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ ఎ. గుప్తా ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతి పట్ల ఐఏఎఫ్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది.. బాధిత కుటుంబ సభ్యులకు అండగా నిలబడతాం. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికే విచారణకు ఆదేశించాం అంటూ ట్విట్ చేసింది.
A MiG-21 Bison aircraft of IAF was involved in a fatal accident this morning, while taking off for a combat training mission at an airbase in central India.
— Indian Air Force (@IAF_MCC) March 17, 2021
ఇదిలాఉంటే.. ఈ ఏడాది జనవరిలో కూడా రాజస్థాన్ బసూరత్‌గఢ్‌లో ఇదే తరహా ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మిగ్-21 యుద్ధ విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో పైలట్ చాకచక్యంగా తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. గత 18 నెలల్లో మిగ్-21 విమానాలు ప్రమాదానికి గురికావడం ఇది మూడోసారి. అయితే ఈ సంఘటన గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో చోటు చేసుకున్నట్లు సమాచారం.
Also Read: