అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సి కాదు.. భారత్‌కు క్షమాపణలు చెప్పిన మార్క్ జుకర్‌బర్గ్..

| Edited By: Shaik Madar Saheb

Jan 15, 2025 | 4:38 PM

జనవరి 10న జో రోగన్ పోడ్‌కాస్ట్‌లో కోవిడ్ 19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై నమ్మకం క్షీణించిందని జుకర్‌బర్గ్ చెప్పారు. అతను భారతదేశాన్ని ఒక ఉదాహరణగా పేర్కొన్నాడు. మార్క్ జుకర్‌బర్గ్ చేసిన ఈ ప్రకటనపై భారత ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే తప్పును సరిద్దిద్దుకోవాలని సూచించింది.

అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సి కాదు.. భారత్‌కు క్షమాపణలు చెప్పిన మార్క్ జుకర్‌బర్గ్..
Mark Zuckerberg Ashwini Vaishnaw
Follow us on

ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల జో రోగన్ పోడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. భారత్ పట్లు అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సి కాదన్నారు. కరోనా మహమ్మారి తర్వాత జరిగిన ఎన్నికల్లో భారత్‌తో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రభుత్వాలు పడిపోయాయని అన్నారు. మార్క్ జుకర్‌బర్గ్ చేసిన ఈ ప్రకటనపై భారత ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఈ ప్రకటనపై పార్లమెంట్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ చైర్మన్, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జుకర్‌బర్గ్ వాదనలను ఖండించారు. 2024 ఎన్నికలలో NDA (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) ప్రభుత్వం అధికారాన్ని నిలుపుకున్నట్లు పేర్కొన్నారు. “ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, భారతదేశం 2024 ఎన్నికలను 640 మిలియన్లకు పైగా ఓటర్లతో నిర్వహించింది. జుకర్‌బర్గ్ చేసిన వాదన వాస్తవంగా సరికాదు. జుకర్‌బర్గ్ నుండి తప్పుడు సమాచారాన్ని చూడటం నిరాశపరిచింది. వాస్తవాలు, విశ్వసనీయతను సమర్థించాలని ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

జనవరి 10న, కోవిడ్ -19 మహమ్మారి తర్వాత అధికార మార్పుపై పాడ్‌కాస్ట్ వేదికగా మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ చేసిన ప్రకటన భారతదేశంలో వివాదానికి కారణమైంది. మహమ్మారి తర్వాత, భారతదేశంతో సహా చాలా దేశాల్లో అధికార మార్పు జరిగిందని, దీని కారణంగా ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం తగ్గిందని జుకర్‌బర్గ్ అన్నారు. ఇప్పుడు ఈ ప్రకటనపై మొత్తం వివాదం తలెత్తింది. జుకర్‌బర్గ్ ప్రకటన భారతదేశానికి వ్యతిరేకమని దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మెటా సీఈవో భారత దేశానికి క్షమాపణలు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..