సర్పంచ్‌ హత్యను ఖండిస్తూ.. బీజేపీపై ఫైర్‌

యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఇటీవల అజాంఘర్‌ జిల్లాలోని బాన్స్‌గాన్‌ గ్రామానికి చెందిన ఓ దళిత సర్పంచ్‌ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. దీంతో అక్కడ ఆందోళనలు..

సర్పంచ్‌ హత్యను ఖండిస్తూ.. బీజేపీపై ఫైర్‌
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2020 | 7:13 PM

యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఇటీవల అజాంఘర్‌ జిల్లాలోని బాన్స్‌గాన్‌ గ్రామానికి చెందిన ఓ దళిత సర్పంచ్‌ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. దీంతో అక్కడ ఆందోళనలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ బాలుడు కూడా చనిపోయాడు. ఈ ఘటనపై బీఎస్పీ చీఫ్ మాయావతి విచారం వ్యక్తం చేసింది. సర్పంచ్‌ హత్యను ఖండిస్తూ.. అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ద‌ళితుల విష‌యంలో గ‌తంలో పాలించిన సమాజ్‌వాదీ పార్టీ మాదిరిగానే.. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తుందని ఆరోపించారు. స‌ర్పంచ్‌ను హ‌త్య చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మాయావతి డిమాండ్‌ చేశారు.

కాగా, సర్పంచ్‌ హత్యకు గురవ్వడంతో.. ఆయన మద్దతుదారులు స్థానిక పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగారు. ఈ ఘటనలో ఆదుగురికి గాయాలయ్యారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు దళిత సర్పంచ్ హత్యపై సీఎం యోగీ ఆదిత్యానాథ్‌ స్పందిస్తూ.. సర్పంచ్‌ కుటుంబ సభ్యులకు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. అంతేకాదు.. తక్షణ సహాయం కింద రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.

Read More :

16 వేల అడుగుల ఎత్తులో రెపరెపలాడిన జాతీయ జెండా

అసోం వరదల బీభత్సం.. 112కి చేరిన మృతులు

ఏనుగు దాడిలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్ మృతి