మా వ్యాక్సిన్ కి నెల రోజుల్లోగా యూరోపియన్ యూనియన్ ఆమోదం.. ఆదార్ పూనావాలా ఆశాభావం

| Edited By: Phani CH

Jul 01, 2021 | 11:14 AM

తమ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కి యూరోపియన్ యూనియన్ నుంచి నెల రోజుల్లోగా ఆమోదం లభించగలదని ఆశిస్తున్నట్టు సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా తెలిపారు.

మా వ్యాక్సిన్ కి నెల రోజుల్లోగా యూరోపియన్ యూనియన్ ఆమోదం.. ఆదార్ పూనావాలా  ఆశాభావం
Adar Poonawalla
Follow us on

తమ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కి యూరోపియన్ యూనియన్ నుంచి నెల రోజుల్లోగా ఆమోదం లభించగలదని ఆశిస్తున్నట్టు సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా తెలిపారు. ఈయూ రెగ్యులేటర్లు మరి కొన్నివారాల్లో మా టీకామందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని భావిస్తున్నాం అని ఆయన చెప్పారు. దీంతో కోవీషీల్డ్ కూడా గ్రీన్ పాస్ లిస్టులో చేరడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆమోదం కోసం తాము ఆస్ట్రాజెనికా కంపెనీ తరఫున దరఖాస్తు చేసినట్టు ఆయన చెప్పారు. బుధవారం ఇండియా గ్లోబల్ ఫోరమ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతానికి తమ టీకామందు విషయంలో ఏ వివాదం లేదని చెప్పారు. లోగడ కొన్ని ఇబ్బందులు తలెత్తినందున వ్యాక్సిన్ ఉత్పత్తి త్వరగా జరగలేదని,కానీ ఇప్పుడా ఇబ్బందులు తొలగిపోయాయని ఆయన తెలిపారు. ఆమధ్య సీరం కంపెనీలో అగ్నిప్రమాదం జరిగిన దృష్ట్యా ..వ్యాక్సిన్ ఉత్పత్తికి కొంత అంతరాయం కలిగింది. వ్యాక్సిన్ కి సంబంధించిన అర్దర్ల మేరకు ఈ టీకామందును ఆయా దేశాలకు సరఫరా చేయలేకపోయింది. పైగా ఎగుమతులపై ఇండియా బ్యాన్ విధించింది.

జనవరిలో ఈ సంస్థ 50 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేయగా.. జూన్ నాటికి దీన్ని సుమారు 90 మిలియన్లకు పెంచింది. ఇంకా పెంచాలన్న యోచన ఉందని ఆదార్ పూనావాలా తెలిపారు. డిమాండుకు తగినట్టు వివిధ దేశాల్లో మరో నాలుగైదు వ్యాక్సిన్ ఉత్పాదక సంస్థలను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి సన్నాహాలు ప్రారంభించామన్నారు. కోవీషీల్డ్ టీకామందుకు సంబంధించి కొన్ని దేశాల్లో రెగ్యులేటర్లు లేవనెత్తిన అభ్యంతరాలు తొలగిపోతాయని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: 2-17 ఏళ్ళ మధ్య వయస్సువారిపై కోవోవాక్స్ ట్రయల్ కి నో…అనుమతిని నిరాకరించిన నిపుణుల కమిటీ…

Colors Swathi: సెకండ్ ఇన్నింగ్స్ లో దుకుడు పెంచిన చలాకీ పిల్ల.. వరుస సినిమాలతో బిజీగా కలర్స్ స్వాతి