Indian Army: భారత్-మయన్మార్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్, 10 మంది ఉగ్రవాదులు హతం!

ఇండో- మయన్మార్ సరిహద్దుల్లో బుధవారం అస్సాం రైఫిల్స్, ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సరిహద్దు ప్రాంతంలో అనుమానిత సాయుధ ఉగ్రవాదుల కలదలికలను గుర్తించిన భద్రతా దళాలు వారిపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో సుమారు 10 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయినట్టు భద్రతా దళాలు తెలిపాయి. ఈ ఎన్‌కౌంటర్ తర్వాత, ఆర్మీ తూర్పు కమాండ్ Xలో ఒక పోస్ట్‌ను షేర్ చేసి విషయాన్ని తెలియజేసింది.

Indian Army: భారత్-మయన్మార్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్, 10 మంది ఉగ్రవాదులు హతం!
Indian Army

Updated on: May 15, 2025 | 7:10 AM

 

మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో బుధవారం అస్సాం రైఫిల్స్, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. , ‘భారత్-మయన్మార్ సరిహద్దుకు సమీపంలో ఉన్న చందేల్ జిల్లా, ఖేగ్‌జోయ్ తహసీల్‌లోని న్యూ సమ్‌తాల్ గ్రామం సమీపంలో సాయుధ కేడర్ల కదలిక గురించి భారత భద్రతా దళాలకు నిర్దిష్ట సమాచారం అందింది. దీంతో అప్రమత్తమై స్పియర్ కార్ప్స్ ఆధ్వర్యంలోని అస్సాం రైఫిల్స్ యూనిట్ మే 14న ఆపరేషన్ ప్రారంభించామని భారత సైనిక బలగాలు వెల్లడించాయి. అయితే, ఈ ఆపరేషన్ సమయంలో, అనుమానిత కేడర్ల నుండి కాల్పులను ఎదుర్కొన్నట్టు అధికారులు తెలిపారు.

ఇక ఈ కాల్పులకు ప్రతీకారంగా సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ భారత దళాల ఎదురుకాల్పుల్లో సుమారు 10 మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఆ తర్వాత వారి నుంచి భారీ మొత్తంలో మందుగుండు సామగ్రి సహా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ తూర్పు కమాండ్ తన X పోస్ట్‌ ద్వారా తెలియజేసింది.

అయితే, భారత్ మయన్మార్ సరిహద్దుల్లో కొంతమంది ఉగ్రవాదులు దాక్కున్నారనే నిర్దిష్టమైన సమాచారంతో భారత భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భారత బలగాలను గుర్తించిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు.వాటిని దీటుగా ఎదుర్కొని భారత్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఉగ్రవాదులు హతమయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..