
భారత దిగ్గజ బాక్సర్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత మేరీ కోమ్ కాపురంలో కలతలు రేగాయి. భర్త కరుంగ్ ఓంఖోలర్‌తో విడాకులకు సిద్ధమైనట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. గత కొంత కాలంగా ఈ జంట విడివిడిగా ఉంటున్నారనీ, అయితే ఇంకా అధికారికంగా విడాకులు మంజూరు కాలేదు. 2022 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలే వీరి కాపురంలో కలతలు రేగడానికి కారణమని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఘోర విఫలం తర్వాత ఈ జంట విడిపోయారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో గత కొంత కాలంగా మేరీ కోమ్ తమ నలుగురు పిల్లలతో ఫరీదాబాద్‌కు మకాం మార్చగా, ఓన్లర్ తన కుటుంబ సభ్యులతో ఢిల్లీలో నివాసం ఉంటున్నారు.
ఎన్నికల ఓటమి తర్వాత భర్త ఓన్లర్, మేరీ కోమ్‌కి మధ్య తీవ్ర మనస్పర్ధలు వచ్చాయి. ఎన్నికల ప్రచార సమయంలో సుమారు 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని, పైగా మణిపూర్‌లో అస్థిర రాజకీయాల దృష్ట్యా ఎన్నికల నుంచి తప్పుకోవాలని మేరీ ఒత్తిడి తెచ్చినప్పటికీ ఆమె భర్త ఓన్లర్ వెనుకడుగువేయలేదు. పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వారి వైవాహిక జీవితంలో కలతలు మరింత తీవ్రమయ్యాయి.
దీంతో మేరీ తన పిల్లలతో ఫరీదాబాద్‌కు మకాం మార్చారు. ఓన్లర్ ఢిల్లీకి వెళ్లిపోయారు. అయితే వీరు విడివిడిగా ఉండటంతో విడాకులు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఈ జంట మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. తాజాగా మరో సంచలన విషయం కూడా ప్రచారంలో ఉంది. మేరీ కోమ్ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మేరీ కోమ్ భర్త రాజకీయ ఎంట్రీ, ముఖ్యంగా బీజేపీతో అనుబంధం, రాజకీయాల్లో అతడి పాత్ర.. ఆమె వైవాహిక జీవితాన్ని మలుపు తిప్పింది. దీంతో వ్యక్తిగత, వృత్తిపరమైన రంగాలలో మేరీ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. ఇది ఎంత వరకు వాస్తవమో తెలియాలంటే ఓ జంట నోరు మెదపాల్సిందే.
Mary Kom Decides to Divorce After 20 Years of Marriage – Here’s What We Know https://t.co/sR7UPkUZKC pic.twitter.com/bG1wl1gVRk
— BollyWoodTime (@BwoodTime) April 8, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.