బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యా రావుకు కష్టాలు రెట్టింపయ్యాయి. రన్యా రావు బెయిల్ పిటిషన్‌పై విచారణను బెంగళూరు కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. రన్యా రావుతో పెళ్లి విషయంపై ఆమె భర్త జతిన్ హుక్కేరి కోర్టుకు సంచలన విషయాలు వెల్లడించారు. రన్యతో తనకు గత నవంబరులో పెళ్లి జరిగిందని , కాని డిసెంబర్ నుంచే తాము విడిగా ఉంటున్నామని కోర్టుకు తెలిపారు. కాకపోతే తాము అధికారికంగా విడిపోలేదని, కొన్ని కారణాల వల్ల వేరుగా ఉంటున్నామని చెప్పారు.
బంగారం స్మగ్లింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి. బెంగళూరు మాత్రమే కాకుండా గోవా , ముంబై నుంచి కూడా రన్యా రావు దుబాయ్‌కు వెళ్లినట్టు DRI అధికారులు వెల్లడించారు. హవాలా మార్గంలో డబ్బులతో బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని అనుమానాలు వ్యక్తం చేశారు. 45 సార్లు దుబాయ్‌కు ఉదయం వెళ్లిన రన్యా సాయంత్రానికి తిరిగి వచ్చినట్టు తెలిపారు.
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యా రావు భర్త జతిన్‌పై ఈనెల 24వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కర్నాటక హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే జతిన్‌కు వ్యతిరేంగా పిటిషన్ వేస్తామని DRI అధికారులు వెల్లడించారు.
గత నవంబర్‌లో బెంగళూరులోని హోటల్ తాజ్ వెస్ట్ ఎండ్‌లో రన్య- జతిన్ వివాహం జరిగింది.
ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు
రన్యా రావుపై బీజేపీ ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె తన శరీరంలోని అన్ని భాగాల్లో బంగారాన్ని దాచి స్మగ్లింగ్ చేసిందన్నారు. “మంత్రులకు ఈ కేసుతో సంబంధం ఉంది. సెక్యూరిటీని దుర్వినియోగం చేశారు. శరీరం లోని అన్ని భాగాల్లో బంగారాన్ని దాచారు. కేంద్రం ఎవరిని కాపాడే ప్రయత్నం చేయలేదు. కస్టమ్స్ అధికారుల ప్రమేయం ఉంటే కచ్చితంగా వాళ్లపై కూడా చర్యలు ఉంటాయి” బసన్నగౌడ పాటిల్ వ్యాఖ్యానించారు.