Today Gold Price: శుభవార్త.. భారీగానే తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు.. తాజాగా దేశ వ్యాప్తంగా ధరల వివరాలు

Today Gold Price: దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరల్లో మార్పు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ..

Today Gold Price: శుభవార్త.. భారీగానే తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు.. తాజాగా దేశ వ్యాప్తంగా ధరల వివరాలు

Edited By: Team Veegam

Updated on: Mar 03, 2021 | 6:45 PM

Today Gold Price: దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరల్లో మార్పు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పసిడి ధరలు దిగి వస్తున్నాయి. దేశీయంగా పది గ్రాముల బంగారం ధరపై రూ.520 మేర దిగి వచ్చింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,420 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,420 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 42,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,930 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 44,420 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,420 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,540 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,640 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,340, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 42,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,930 ఉంది. అయితే తాజా ధరలు పరిస్థితులను బట్టి ధరల్లో మార్పు చేర్పులు ఉంటాయి.

కాగా, దేశంలోని బంగారం ధరలపై ప్రభావం చూపే కారణాలు చాలా ఉంటున్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఇటీవల నుంచే బంగారం ధరల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులు ధరలు పెరుగుతుంటే.. మరి కొన్ని రోజులు తగ్గుముఖం పడుతున్నాయి. ఒకప్పుడు 55 వేల వరకు మార్క్‌ దాటి పోగా, ప్రస్తుతం మాత్రం 50 వేల లోపునే ధరలు ఉంటున్నాయి.

ఇవి చదవండి :

Semi Bullet Trains: త్వరలో సెమీ బుల్లెట్‌ రైళ్ల కూత.. ప్రత్యేక బోగీలు, ఆధునిక హంగులు..ప్రయోగాత్మక పరీక్షలు

ఆ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ ఫాం టికెట్‌ ధర రూ.50.. కరోనా కట్టడి కోసమే ఈ నిర్ణయం అంటున్న రైల్వే అధికారులు

కడక్‌నాథ్ చికెన్‌కు పెరుగుతున్న డిమాండ్.. హైదరాబాద్‌లో కేజీ ధర ఎంతంటే..?