Today Gold Price: దేశంలో బాంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. గతకొద్దిరోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బుధవారం (10/3/2021) దేశీయంగా బంగారం ధర ఇలా ఉన్నాయి. దేశీయంగా గ్రాము బంగారంపై రూ.25 తగ్గింది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 43,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,860 వద్ద ఉంది. అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,440, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,480 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో…
అలాగే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.41,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,440 ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,440 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,440 వద్ద కొనసాగుతోంది.అయితే బంగారం కొనుగోలు చేసే వారికి ఇది సరైన సమయమని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా తగ్గుతుందా… లేక ఇంతేనా అనే ప్రశ్నకు సమాధానం లేదని పేర్కొంటున్నారు. ఇంకా తగ్గవచ్చనే అంచనా ఉంది కానీ ఎంత వరకూ తగ్గుతుందో చెప్పలేమని సూచిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Photo Gallery: బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ విధులు.. మహిళా పోలీస్ ఫోటోలు వైరల్.. ఇంతకీ ఎక్కడంటే..?
Helpline Number: భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక నుంచి అన్ని ఫిర్యాదులు చేయాలంటే 139 నెంబర్‌కే..
Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. అల్ బదర్ చీఫ్ హతం.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్