ఝార్ఖండ్ లో మళ్ళీ రెచ్చిపోయిన మావోయిస్టులు, మందుపాతర పేలుడులో ఇద్దరు జవాన్ల మృతి

| Edited By: Anil kumar poka

Mar 04, 2021 | 12:53 PM

ఝార్ఖండ్ లో మావోయిస్టులు మళ్ళీ పేట్రేగిపోయారు. పశ్చిమ సింగ్ భమ్ జిల్లాలోని చాయ్ బసలో గురువారం ఉదయం వారు మందుపాతరను   పేల్చివేయడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందారు.

ఝార్ఖండ్ లో మళ్ళీ రెచ్చిపోయిన మావోయిస్టులు, మందుపాతర పేలుడులో ఇద్దరు జవాన్ల మృతి
Follow us on

ఝార్ఖండ్ లో మావోయిస్టులు మళ్ళీ పేట్రేగిపోయారు. పశ్చిమ సింగ్ భమ్ జిల్లాలోని చాయ్ బసలో గురువారం ఉదయం వారు మందుపాతరను   పేల్చివేయడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఝార్ఖండ్ జాగ్వార్ యూనిట్ కి చెందిన వీరిని హర్ ద్వార్ సింగ్, కిరణ్ సురిన్ గా గుర్తించారు. ఈ పేలుడులో మరో ముగ్గురు గాయపడ్డారు. వీరిని హుటాహుటిన రాంచీ ఆసుపత్రికి తరలించారు. హోయ హతు అనే గ్రామ సమీపంలో పోలీసులు, జవాన్లు గాలింపు జరుపుతుండగా మావోలు మందుపాతర పేల్చారు. అటు- వీరికి, భద్రతా దళాలకు మధ్య ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మందుపాతర పేలుడులో మరికొంతమంది గాయపడడమో , మరణించడమో జరిగినట్టు భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

మరిన్ని చదవండి ఇక్కడ :

snake Drinking water Viral Video : దాహంతో ఉన్న పాముకు నీళ్లు తాగించిన వ్వక్తి వైరల్ అవుతున్న వీడియో..!

విజయనగరం యువతి ఫేక్‌స్టోరీ! కాళ్లుచేతులు కట్టేసుకుని..తానే నాటకం ఆడినట్టు అంగీకారం : girl kidnap video

మీ వల్లే ఈ జర్నీ బ్యూటిఫుల్‌గా సాగింది..మరో రికార్డు సొంతం చేసుకున్న క్రికెటర్ కోహ్లీ : Virat Kohli New Record Video