Manipur Violence: మణిపూర్ అత్యాచార ఘటనపై ప్రధాని స్పందన.. నిందితులను వదిలేది లేదంటూ వార్నింగ్..

మహిళను నగ్నంగా ఊరేగించిన మణిపూర్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ‘మణిపూర్ ఘటన దేశానికి సిగ్గుచేటు, నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.’ అని అన్నారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం చేసి, ఆపై వారిని నగ్నంగా ఊరేగించారు.

Manipur Violence: మణిపూర్ అత్యాచార ఘటనపై ప్రధాని స్పందన.. నిందితులను వదిలేది లేదంటూ వార్నింగ్..
Pm Modi

Updated on: Jul 21, 2023 | 10:37 AM

మహిళను నగ్నంగా ఊరేగించిన మణిపూర్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ‘మణిపూర్ ఘటన దేశానికి సిగ్గుచేటు, నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.’ అని అన్నారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం చేసి, ఆపై వారిని నగ్నంగా ఊరేగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై యావత్ భారతదేశం భగ్గుమంది. ప్రతిపక్షాలు ప్రధాని మోదీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించింది. ముందుగా ఈ వీడియో వైరల్ అయ్యేందుకు కారణమైన ట్విట్టర్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. లా అండ్ ఆర్డర్ సమస్యకు కారణమైన వీడియో వైరల్ అయ్యేందుకు దోహదపడిందనే కారణంతో ట్విట్టర్‌పై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..