Manipur Violence: జిరిబామ్‌లో 10 మంది కుకీ ఉగ్రవాదులు హతం.. ఒక CRPF జవాన్ కు గాయాలు

|

Nov 11, 2024 | 6:38 PM

మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో కుకీ ఉగ్రవాదులపై భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. బోరోబెక్రా సబ్‌డివిజన్ జిరిబామ్‌లోని జకురాధోర్ కరోంగ్‌లో భద్రతా బలగాలు 10 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ ఆపరేషన్‌లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ గాయపడ్డాడు.

Manipur Violence: జిరిబామ్‌లో 10 మంది కుకీ ఉగ్రవాదులు హతం.. ఒక CRPF జవాన్ కు గాయాలు
Manipur
Image Credit source: file photo
Follow us on

మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో కుకీ ఉగ్రవాదులపై భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. బోరోబెక్రా సబ్‌డివిజన్ జిరిబామ్‌లోని జకురాధోర్ కరోంగ్‌లో భద్రతా బలగాలు 10 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ ఆపరేషన్‌లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ గాయపడ్డాడు. మణిపూర్ లోని ఇంఫాల్ లోయ జాతి సంఘర్షణకు తీవ్ర ప్రభావిత ప్రాంతంగా మారింది. దీంతో పాటు ఈ లోయలో ఉగ్రవాదులు భీభత్సం సృష్టించారు. పొలాల్లో పని చేస్తున్న రైతులను లక్ష్యంగా చేసుకుని నిరంతరంగా దాడులు చేస్తున్నారు. ఉగ్రవాదుల భీభత్సంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పొలాల్లో పనులకు వెళ్లడం కూడా మానేస్తున్నారు.

సోమవారం ఇంఫాల్‌లోని కొండలపై నుంచి మిలిటెంట్లు కాల్పులు జరిపారు. దీంతో పొలంలో పనిచేస్తున్న రైతుకు గాయాలయ్యాయి. ఇది వరుసగా మూడో రోజు రైతులపై దాడి. ఈ దాడులతో పొలాల్లోకి వెళ్లేందుకు పొలాల్లోని రైతులు భయపడుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా పంటల సాగు దెబ్బతింటోంది.

భద్రతా బలగాలు ఎదురుకాల్పులు

ఇవి కూడా చదవండి

రైతుపై కాల్పులు జరిపిన సంఘటన ఉదయం 9:20 గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. కాంగ్‌పోక్పి జిల్లాలోని కొండ ప్రాంతాలకు చెందిన మిలిటెంట్లు యైంగాంగ్‌పోక్పి శాంతిఖోంగ్‌బన్ ప్రాంతంలో రైతులపై కాల్పులు జరిపారు. ఇందులో ఓ రైతు చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి.

ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కొంతసేపు కాల్పులు కొనసాగినట్లు అధికారి తెలిపారు. గాయపడిన రైతు యైంగాంగ్‌పోక్పి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.

అంతేకాదు శనివారం తెల్లవారుజామున చురచంద్‌పూర్ జిల్లాలోని కొండ ప్రాంతాల నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో విష్ణుపూర్ జిల్లాలోని సెటన్‌లో పొలాల్లో పని చేస్తున్న 34 ఏళ్ల మహిళా రైతు మృతి చెందింది. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని సన్సాబి, థమ్నాపోక్పి, సబుంగ్‌ఖోక్ ఖునౌలో కూడా ఇలాంటి దాడులు ఆదివారం జరిగాయి. గత ఏడాది మే నుంచి ఇంఫాల్ లోయలో మెయిటీ, కుకీ వర్గాల మధ్య మొదలైన జాతి ఘర్షణలో ఇప్పటివరకు 200 మందికి పైగా మరణించారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..