బ్యాగ్‌నిండా డబ్బుతో బ్రేక్‌ఫాస్ట్ చేసేందుకు వెళ్లిన రిటైర్డ్ టీచర్.. ఆ తర్వాత సీన్‌ సీసీ ఫుటేజ్‌లో రికార్డైంది..!

|

Jan 17, 2023 | 8:18 PM

బ్యాంకు నుంచి రూ.1లక్ష 30వేలు విత్‌డ్రా చేసి మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో హోటల్‌లో టిఫిన్‌ చేశాడు.. అతని బ్యాగ్‌ ఆ పక్కనే పెట్టుకున్నాడు.

బ్యాగ్‌నిండా డబ్బుతో బ్రేక్‌ఫాస్ట్ చేసేందుకు వెళ్లిన రిటైర్డ్ టీచర్.. ఆ తర్వాత సీన్‌ సీసీ ఫుటేజ్‌లో రికార్డైంది..!
Record In Cctv
Follow us on

బ్యాగు నిండా డబ్బుతో బ్రేక్‌ ఫాస్ట్‌ చేసేందుకు వెళ్లిన ఓ రిటైర్డ్‌ టీచర్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఇంటి ఖర్చుల నిమిత్తం రిటైర్డ్ టీచర్ బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని తిరిగి వెళ్తున్నారు. దారిలో బ్రేక్‌ఫాస్ట్‌ చేసేందుకు హోటల్‌ వద్ద ఆగాడు. ఇదంతా గమనించిన ఓ యువకుడు రిటైర్డ్‌ టీచర్‌ని ఫాలో అవుతూ వచ్చాడు. ఆ తర్వాత అదును చూసి టీచర్ బ్యాగ్ నిండా డబ్బు తీసుకుని పారిపోయాడు. ఈ ఘటన మొత్తం హోటల్‌లోని సీసీటీవీలో రికార్డయింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో చోరీ ఘటన సీసీ ఫుటేజ్‌లో రికార్డైంది. బ్యాంకు నుంచి లక్షా 30 వేల రూపాయలు తీసుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తి బ్రేక్‌ ఫాస్ట్‌ చేసేందుకు హోటల్‌ వద్ద ఆగాడు. వెనకాల కుర్చీలో కూర్చున్న వ్యక్తి అవకాశంగా తీసుకుని డబ్బులతో కూడిన బ్యాగ్‌ని తీసుకుని పారిపోయాడు. ఈ ఘటన మొత్తం హోటల్‌లోని సీసీటీవీలో రికార్డయింది.

నిజానికి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుఖ్రి గ్రామంలో నివాసం ఉంటున్న రాంధాని రామ్ చౌదరి రిటైర్డ్ టీచర్. శుక్రవారం ఇంటి పని ఖర్చుల కోసం డబ్బు తీసుకునేందుకు రామధాని బ్యాంకుకు వెళ్లాడు. అతని ఖాతా స్టేట్ బ్యాంక్ ఆఫ్ అంబికాపూర్ శాఖలో ఉంది. బ్యాంకు నుంచి రూ.1లక్ష 30వేలు విత్‌డ్రా చేసి మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రాంధాని గాంధీచౌక్ సమీపంలోని వెల్‌కమ్ హోటల్‌లో టిఫిన్‌ చేశాడు.. అతని బ్యాగ్‌ ఆ పక్కనే పెట్టుకున్నాడు. ఈ లోగానే బ్యాగ్‌ మాయమైంది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

ఇవి కూడా చదవండి

రాంధాని చెప్పిన వివరాల ప్రకారం.. అతను హోటల్‌లో బ్రేక ఫాస్ట్‌ చేసి బిల్లు చెల్లించి బయటకు వచ్చాడు. బయటకి వచ్చాక నా బ్యాగ్‌ని హోటల్‌లో వదిలేసిన సంగతి గుర్తొచ్చింది. రాంధాని తిరిగి హోటల్‌కి వెళ్లాడు. బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన కుర్చీ వద్దకు వెళ్లి చూడగా బ్యాగ్‌ కనిపించలేదు. హోటల్ నిర్వాహకులను అడిగితే.. బ్యాగ్ చూడలేదని చెప్పారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన రాంధాని, హోటల్ యజమాని హోటల్‌లోని సీసీటీవీని చెక్‌ చేశారు. రాంధాని టేబుల్ వెనుక కూర్చీలో కూర్చున్న యువకుడు..డబ్బున్న బ్యాగును తీసుకుని వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. కేవలం ఏడు నిమిషాల్లోనే బ్యాగ్ మాయం చేశాడు. సీసీటీవీలో బ్యాగ్ ఎత్తుకెళ్లిన యువకుడు కనిపించాడు. సీసీవీవీలో బ్యాగును దొంగిలించిన యువకుడి ముఖం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..