Illegal Relationship: ఇప్పటి వరకు ఎన్నో నేర వార్తలు చదవి ఉంటాం. కానీ, ఈ వార్తను పూర్తిగా చదివితే కచ్చితంగా విస్తుపోతారు. కోపంలో ఓ వ్యక్తి మరో వ్యక్తిని హత్య చేయడం చూశాం. పగతో చేసిన హత్యలు చూశాం. సుపారీ ఇచ్చి చేయించిన హత్యలను చూశాం. అక్రమ సంబంధాల నేపథ్యంలో హత్య చేసిన దాఖలాలు చూశాం. అయితే, ఈ హత్య దాదాపు అక్రమ సంబంధం నేపథ్యంలోనే జరిగింది. కానీ, ఇక్కడ ఓ యువతి ఓ వ్యక్తిని చంపేందుకు కేవలం సుపారీ ఇవ్వడమే కాదు.. తనకు అడ్డుగా ఉన్న వ్యక్తిని చంపినందుకు సదరు నిందితుడితో ఏకాంతంగా గడిపింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగ్‌పూర్‌కు చెందిన చందూ మహాపూర్‌కి పెళ్లి అయ్యింది. చందుకి అదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతికి మధ్య అక్రమ సంబంధం ఉంది. కొన్నాళ్ల పాటు వారి సంబంధం సాఫీగా సాగింది. అయితే తాజాగా, ఆ యువతికి వేరొకరితో వివాహం నిశ్చయమైంది. దాంతో ఆ యువతి పెళ్లికి సిద్ధమైంది. కానీ యువతి పెళ్లి చేసుకోవడం ఆమె ప్రియుడికి ఇష్టం లేదు. నువ్ పెళ్లి చేసుకోవద్దు అంటూ యువతిని బలవంతం పెట్టాడు. దాంతో అతనిపై యువతికి విపరీతమైన కోపం తెచ్చుకుంది. అతను ఉంటే తన పెళ్లి కాదని భావించి.. అతన్ని అంతమొందించాలని ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలో నేరస్తుడైన భరత్ గుర్జార్‌ను సంప్రదించి.. అతనితో డీల్ కుదుర్చుకుంది. చందూని చంపేస్తే రూ. లక్షన్నర ఇస్తానంది. అదీ చాలకపోతే ఏకాంతంగా గడుపుతానంటూ భరత్‌కి ఆఫర్ ఇచ్చింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. చందూకు భరత్ దూరపు చుట్టం అవడం. ఆ బంధుత్వం నేపథ్యంలోనే చందూను భరత్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ అతనిపై కత్తితో దాడి చేసి దారుణంగా చంపేశాడు. అనంతరం చందూ మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేసి వెళ్లాడు. అయితే విషయం పోలీసులకు చేరడంతో.. నిందితుడు భరత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు, యువతిని, ఆమె తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు.
Also read:
Snake at school: బడికొచ్చిన కోడెత్రాచు.. విద్యార్థులు, సిబ్బంది భయంతో పరుగులు.. చివరకు