అబ్బ తమ్ముడూ మామూలోడివి కాదుగా.. విదేశాలకు వెళ్లొస్తానంటూ.. 21 మందిని పెళ్లాడాడు.. చివరకు..

ఒక్కొక్కరి దగ్గర ఒక్కో పేరు.. ఊరు.. చెబుతూ అమ్మాయిలను పరిచయం చేసుకుంటాడు.. మంచి ఉద్యోగం.. విదేశాలకు వెళతా.. ఆ తర్వాత మీ అమ్మాయిని తీసుకెళ్తా.. అంటూ పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకుంటాడు..

అబ్బ తమ్ముడూ మామూలోడివి కాదుగా.. విదేశాలకు వెళ్లొస్తానంటూ.. 21 మందిని పెళ్లాడాడు.. చివరకు..
Crime News

Updated on: Dec 25, 2022 | 6:30 PM

ఒక్కొక్కరి దగ్గర ఒక్కో పేరు.. ఊరు.. చెబుతూ అమ్మాయిలను పరిచయం చేసుకుంటాడు.. మంచి ఉద్యోగం.. విదేశాలకు వెళతా.. ఆ తర్వాత మీ అమ్మాయిని తీసుకెళ్తా.. అంటూ పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకుంటాడు.. కొన్ని రోజులు అక్కడే గడిపి డబ్బు, నగలతో ఉడాయిస్తాడు. అలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 21 మందిని పెళ్లిచేసుకున్నాడు.. ఓ ప్రబుద్ధుడు.. కట్ చేస్తే.. ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు. నిత్య పెళ్లికొడుకు కార్తీక్ రాజా బాగోతాన్ని తమిళనాడు పోలీసులు బట్టబయలు చేశారు. కార్తీక్ రాజాను తిరువణ్ణామలైలో స్పెషల్‌ ఫోర్స్‌ పోలీసులు శనివారం అరెస్టు చేసి విచారించడంతో.. పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామనాథపురం జిల్లా పరమక్కుడికి చెందిన కార్తీక్‌ రాజా (26) ప్రైవేట్‌ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో విరుదునగర్‌ జిల్లా సాత్తూరు సమీపంలోని వల్లంపట్టికి చెందిన 20 ఏళ్ల యువతిని ఈ ఏడాది మార్చిలో వివాహం చేసుకున్నాడు.

కొన్ని రోజుల పాటు బాగానే ఉన్న రాజా.. విదేశానికి వెళ్తున్నానని చెప్పి ఐదు సవర్ల నగలు, నగదు తీసుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత భర్త గురించి ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో యువతి పన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కార్తీక్‌ రాజా తిరువణ్ణామలై జిల్లాలో ఉన్నట్లు తెలుసుకుని.. శుక్రవారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల విచారణలో షాక్ అయ్యే లాంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి.

కార్తీక్ రాజాకు అంతకు ముందే 20 పెళ్లిళ్లు అయ్యాయని పోలీసులు గుర్తించారు. నమ్మించి పెళ్లి చేసుకోవడం.. డబ్బులు, నగలతో ఉడాయించడమే ఇతని రెగ్యులర్ డ్యూటీ అని పోలీసులు వెల్లడించారు. ఆ కొట్టేసిన డబ్బుతో.. రిచ్ మ్యాన్‌లాగా బిల్డప్ ఇవ్వడం, మరో పెళ్లి చేసుకోవడం అలవాటుగా మారిందని వివరించారు.

ఇవి కూడా చదవండి

వివిధ గ్రామాలకు చెందిన 20 మందికి పైగా మహిళలను పెళ్లి చేసుకుని వారి నుంచి 80 సవర్లకు పైగా నగలు తీసుకున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై పలు చోట్ల కేసులు నమోదయ్యాని.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..