జమ్మూ కశ్మీర్లో ఇటీవల ఓ 8 ఏళ్ల బాలిక మరణించిన తర్వాత పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఆ బాలికను ఆమె తండ్రే హత్య చేసినట్లు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. కుప్వారా జిల్లాలోని కుర్హామ గ్రామంలో మహమ్మద్ ఇక్బాల్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. అయితే ఇక్బాల్ తన భార్యతో నిత్యం గొడవ పడుతూ ఉండేవాడు. బుధవారం రోజున మళ్లీ తన భార్యతో గొడవ జరగడంతో ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి తన వాహనంపై వెళ్లాడు. అయితే తన కూతురు అతడ్ని ఒంటరిగా వెళ్లనియ్యలేదు. తన తండ్రితో పాటు ఆమె కూడా వాహనంలో ఎక్కింది. అలాగే ఆమె తోబుట్టవులు కూడా వారి వెంట వెళ్లారు. అతడ్ని ఇంటికి తిరిగి రావాలని వారు ఎంత వేడుకున్న ఇక్బాల్ నిరాకరించాడు. తన కూతురుని కూడా వాహనంలో నుంచి బయటకు పంపించేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె వెళ్లలేదు.
ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఇక్బాల్.. తన కూతురు ఉంటే ఎలా చేసుకోగలనని సందేహంలో పడ్డాడు. కోపంతో ఆమె గొంతును నులమడంతో ఆ బాలిక చనిపోయింది. ఆ తర్వాత ఆమెను ఓ స్టోరేజ్ షెడ్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయాడు. కానీ అతను ఆత్మహత్య చేసుకునేందుకు యత్నిచలేదు. కొన్ని గంటల తర్వాత ఇక్బాల్ ఇంటికి వెళ్లగ..కుటుంబ సభ్యులు ఆ అమ్మాయి గురించి అడిగారు. ఆమె తనతో పాటు రాలేదని ఇక్బల్ సమాాధానమిచ్చాడు. కానీ ఆమె ఇక్బాల్ వెంటే వచ్చిందని వారు వాదించగా.. చివరకి ఇక్బాల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అతను ఇంటికి వచ్చే లోపలే ఆ బాలిక మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యలు, బంధులు గుర్తించి ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం ఇక్బాల్ ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటూ బంధుమిత్రులు డిమాండ్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం