
స్మగ్లర్లు రోజురోజుకూ ఇస్మార్ట్ ఐడియాలతో రెచ్చిపోతున్నారు. కస్టమ్స్, పోలీసులు నుంచి తప్పించుకునేందుకు అతి తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. నిఘా విభాగం అధికారులు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా, ఎంతమందిని జైల్లో వేసినా.. కొందరి బుద్ది మార్చుకోవడం లేదు. అడ్డదారుల్లో అక్రమ బంగారం రవాణా చేసి.. సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం కొందరు ప్రాణాలకు కూడా తెగిస్తున్నారు. వారు ప్లే చేసే ట్రిక్స్ మాత్రం నెక్ట్స్ లెవల్. తాజాగా సింగపూర్ విమానాశ్రయంలో ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు గోల్డ్ అక్రమంగా స్మగ్లింగ్ చేసేందుకు యత్నించినట్లు తెలిపారు. నిందితుడు బంగారాన్ని లోదుస్తుల(అండర్‌వేర్)లో దాచినట్లు తెలిపారు. పక్కా సమాచారం మేరకు నిందితుడిని పట్టుకున్నారు.
సింగపూర్ నుంచి కేరళలోని తిరుచ్చికి ఓ వ్యక్తి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులకు ఉప్పు అందింది. సోర్సస్ ద్వారా అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే లగేజ్‌తో పాటు బాడీ అంతా వెతికినా కూడా అతడి వద్ద బంగారం దొరకలేదు. పొరపాటు జరిగిందేమో అనుకున్నారు అధికారులు. అయితే వారిలోని ఒకరు నిందితుడి లోదుస్తులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని భావించారు. అప్పుడు నిందితుడి డ్రాయర్‌లో గోల్డ్ పేస్ట్ ఉన్న ప్యాకెట్ లభ్యమైంది.
कच्छे में छिपाकर ला रहा था 15 लाख का सोना।
ये मामला सिंगापुर का है, यात्री अंडरवियर में 301 ग्राम सोना छिपाकर लाने की कर रहा था कोशिश। कस्टम के मुताबिक़ बरामद सोने की कीमत 15 लाख रूपए बताई जा रही है। pic.twitter.com/y7368WmrPt
— Shubhankar Mishra (@shubhankrmishra) October 2, 2022
కేటుగాడు తన అండర్‌వేర్ 2 పొరల మధ్య చాలా నాక్‌గా బంగారాన్ని దాచాడు. డ్రాయర్ కట్ చేసి.. లోపల ఉన్న 301 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.15.32 లక్షలు ఉంటుందని తెలిపారు. తదుపరి విచారణ జరుగుతోందని అధికారులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం