Spicejet: విమానంలో కుదుపులు.. తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి.. స్పైస్ జెట్ స్పందనేంటంటే..

|

Oct 30, 2022 | 1:08 PM

స్పైస్ జెట్ విమానంలో కుదుపులకు గురైనప్పుడు తీవ్ర గాయాలపాలైన ప్యాసింజర్ మృతి చెందారు. ముంబయి - దుర్గాపూర్ ఫ్లైట్ లో ఈ ఏడాది మే నెలలో స్పైస్ జెట్ ఫ్లైట్ లో విపరీతమైన కుదుపుల కారణంగా వెన్నెముకలో..

Spicejet: విమానంలో కుదుపులు.. తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి.. స్పైస్ జెట్ స్పందనేంటంటే..
Spicejet
Follow us on

స్పైస్ జెట్ విమానంలో కుదుపులకు గురైనప్పుడు తీవ్ర గాయాలపాలైన ప్యాసింజర్ మృతి చెందారు. ముంబయి – దుర్గాపూర్ ఫ్లైట్ లో ఈ ఏడాది మే నెలలో స్పైస్ జెట్ ఫ్లైట్ లో విపరీతమైన కుదుపుల కారణంగా వెన్నెముకలో రక్త స్రావంతో అన్సారీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఘటనలో అన్సారీతో పాటు పద్నాలుగు మంది ప్యాసింజర్లు గాయపడ్డారు. ఘటనకు తమదే పూర్తి బాధ్యత అని స్పైస్ జెట్ తాజాగా ప్రకటించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 1980 లో కూడా విమాన కుదుపులతో ఇండియన్ ఎయిర్ లైన్స్ లో ఇద్దరు ప్రయాణికులు చనిపోయారు. దాదాపు నెల రోజుల పాటు అన్సారీని వెంటిలేటర్‌పై ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అన్సారీకి సంబంధించిన హాస్పిటల్‌, ముందుల ఖర్చులకు సంబంధించిన అన్ని విధాలా సాయపడ్డామని స్పైస్‌జెట్‌ తెలిపింది. ఈ ఘటనలో గాయపడిన మరో ఇద్దరూ ఐసీయూలో చికిత్స తీసుకున్నట్లు డీజీసీఏ గతంలో తెలిపింది. భారత్‌లో విమానం కుదుపులకు లోనై మరణం సంభవించిన ఘటనల్లో ఇది రెండోది కావడం గమనార్హం.

ముంబై నుంచి దుర్గాపూర్ కు చేరుకున్న స్పైస్ జెట్ సంస్థకు చెందిన బోయింగ్ బి-737 ఫ్లైట్.. ఇంకాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా గాల్లో భారీ కుదుపులకు లోనైంది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తుఫాను కారణంగా వాతావరణ పరిస్థితులు ప్రతికూలించడంతో ఇలా జరిగినట్లు అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది వెంటనే సీటు బెల్టులు పెట్టుకోవాలంటూ ప్రయాణికులకు హెచ్చరించారు. కుదుపుల మరింత ఎక్కువయ్యాయి. లగేజీ భాగం నుంచి లగేజీ జారిపోయి ప్రయాణికుల తలలపై పడింది. సీట్లు కట్ అయిపోయాయి. ప్రయాణికుల వస్తువులన్నీ చిందరవందరగా పడిపోయాయి.

ఇవి కూడా చదవండి

తీవ్రంగా శ్రమించిన విమానయాన సిబ్బంది.. ఎట్టకేలకు విమానంపై పట్టు సాధించి సురక్షితంగా దుర్గాపూర్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో మొత్తం 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురు విమాన సిబ్బంది కూడా ఉన్నారు. ఒక ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉంది. విషమంగా ఉన్న వ్యక్తే ప్రస్తుతం చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..