అమ్మో బాబోయ్..ఫెస్బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ చేసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు.. ఎక్కడంటే
ఈ మధ్యకాలంలో భార్య వదిలేసి వెళిపోయిందనో..ప్రియురాలు ప్రేమించలేదనో..ఉద్యోగం రావట్లేదనో లాంటి చిన్న చిన్న విషయాలుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి.

ఈ మధ్యకాలంలో భార్య వదిలేసి వెళిపోయిందనో..ప్రియురాలు ప్రేమించలేదనో..ఉద్యోగం రావట్లేదనో లాంటి చిన్న చిన్న విషయాలుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా మహారాష్ట్రలోని ఓ వ్యక్తి భార్య వదిలేసి వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకో ఆసక్తికర విషయమేంటంటే తాను ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఫెస్ బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ చేసి మరి ఉరివేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని నాగ్పూర్ కు చెందిన క్రుతాంక్ సిద్దార్థ్ డోంగ్రే అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉండేవాడు.
అయితే సిద్ధార్థ్ డోంగ్రేకు తాగుడు అలవాటు ఉంది. అలాగే అతను ఓ నిరుద్యోగి. ఇటీవల తన భార్యతో అతనికి గొడవ జరిగింది. దీంతో ఆమె అతడ్ని వదిలి వెళ్లిపోయింది. సోమవారం రోజున సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు బయటకు వెళ్లారు. ఈ క్రమంలోనే అతను మద్యం సేవించి తన మొబైల్లో భార్య ఫెస్ బుక్ అకౌంట్ లో రాత్రికి లాగిన్ అయ్యాడు.అందులో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వీడియో వైరల్ కావడంతో సిద్దార్థ్ బంధుమిత్రులు, పొరిగింటి వారు అతని ఇంటికి వచ్చారు. సమాచారం అందిచండంతో ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం.




