Watch Video:పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన 32ఏళ్ల వ్యక్తి… ఆస్పత్రికి తరలించే లోపుగానే..

|

Jan 19, 2023 | 3:56 PM

మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన అభయ్ సచన్ వివాహానికి హాజరయ్యాడు. రాత్రి 11 గంటలకు ఊరేగింపు జరుగుతుండగా వరుడి స్నేహితుడు అభయ్ బ్యాండ్, డప్పుల దరువులకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నట్టు తెలిసింది. ఎంతో హుషారుగా డ్యాన్స్‌ చేస్తున్న అతడు.. కొంతసేపటికి నేలపైనే కుప్పకూలి

Watch Video:పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన 32ఏళ్ల వ్యక్తి... ఆస్పత్రికి తరలించే లోపుగానే..
Cardiac Arrest
Follow us on

గతేడాది కాలం నుంచి యువకులు, విద్యార్థులు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్న దిగ్భ్రాంతికరమైన వార్తలు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం గుండెపోటు కావడం ఆందోళన కలిగిస్తోంది. పాఠశాల విద్యార్థుల్లో కూడా గుండెపోటు గురించిన వార్తలు మరింత భయాన్ని కలిగిస్తున్నాయి. డ్యాన్స్ చేస్తున్నప్పుడు, జిమ్‌లో వర్కవుట్ చేస్తూ మరణించిన సంఘటనలు మనం చూశాం. అదేవిధంగా, మధ్యప్రదేశ్‌లో జరిగిన పెళ్లి ఊరేగింపు బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ 32 ఏళ్ల వ్యక్తి మరణించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన యువకుడు స్నేహితుడి పెళ్లి కోసం మధ్యప్రదేశ్‌లోని రేవాకు వచ్చినట్లు సమాచారం.

ఊరేగింపులో ఉల్లాసంగా డ్యాన్స్ చేస్తున్న ఈ యువకుడు ఒక్కసారిగా నేలపై కుప్పకూలి పోయాడు. అక్కడికక్కడే మృతి చెందిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంత చిన్న వయసులో హఠాన్మరణం చెందాడన్న వార్తను నమ్మలేక పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న వారంత షాక్‌లో ఉండిపోయారు. ఈ సంఘటన జనవరి 17, మంగళవారం రాత్రి జరిగినట్లు సమాచారం. మరణించిన యువకుడు 32 ఏళ్ల అభయ్ సచన్, అతని తండ్రి మూల్‌చంద్ర సచన్‌గా గుర్తించారు. మంగళవారం రాత్రి, ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నుండి బస్టాండ్ సమీపంలోని అమర్‌దీప్ ప్యాలెస్‌కు పెళ్లి ఊరేగింపు వచ్చింది. అందులో మరణించిన యువకుడు కూడా పాల్గొన్నాడు. వధువు మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన అభయ్ సచన్ వివాహానికి హాజరయ్యాడు. రాత్రి 11 గంటలకు ఊరేగింపు జరుగుతుండగా వరుడి స్నేహితుడు అభయ్ బ్యాండ్, డప్పుల దరువులకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నట్టు తెలిసింది. ఎంతో హుషారుగా డ్యాన్స్‌ చేస్తున్న అతడు.. కొంతసేపటికి నేలపైనే కుప్పకూలి మృతి చెందినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

అతను నేలపై పడిపోవడంతో అక్కడున్నవారంతా వెంటనే.. అభయ్‌ను సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అభయ్‌ గుండెపోటుతో మృతి చెందాడని,ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయినట్టుగా వైద్యులు తెలిపారు. అనంతరం దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పెళ్లికి వచ్చిన స్నేహితులు, వధూవరుల కుటుంబాలతో మాట్లాడారు. బుధవారం మధ్యాహ్నం అభయ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. జరిగిన ఘటనతో ఇటు పెళ్లింట, అటు అభయ్‌ కుటుంబంలో తీరని విషాదం నిండిపోయింది. పెళ్లి వేడుక శోక సంద్రంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..