Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో హోరాహోరీ పోరులో మమతా బెనర్జీ తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బెంగాల్‌లో వరుసగా మూడోసారి టీఎంసీ అధికారం చేపట్టనుంది. మే 5న బుధవారం తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సోమవారం కోల్‌కతాలో జరిగిన పార్టీ సమావేశంలో టీఎంసీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీని శాసనసభాపక్ష నాయకురాలిగా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మమతా ప్రమాణ స్వీకారం అనంతరం.. కొత్త క్యాబినెట్‌లోని మంత్రులు మే 6న ప్రమాణం చేయనున్నారు. ప్రోటెమ్ స్పీకర్‌గా సుబ్రతా ముఖర్జీ వ్యవహరించనున్నారు. ఆ తరువాత బిమాన్ బెనర్జీ స్పీకర్ పదవిలో కొనసాగుతారని పేర్కొంటున్నారు.
పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం మమతా బెనర్జీ ఈ రోజు రాత్రి 7 గంటలకు రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్‌ను కలవనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించిన తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మమతా పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా.. మమతా నందిగ్రామ్‌లో.. బీజేపీ నేత సువేందు అధికారిపై ఓటమి పాలయ్యారు. కాగా.. మూడోసారి కూడా మమతా బెనర్జీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. అనంతరం ఆరు నెలల లోపు మమతా ఎక్కడో ఒకచోట ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది.
Also Read: