Mamata Banerjee: అమిత్ షా‌కు ఫోన్ చేసినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. మమతా బెనర్జీ సవాలు

|

Apr 19, 2023 | 7:26 PM

తృణమూల్ కాంగ్రెస్ జాతీయ పార్టీ హోదా తర్వాత తాను అమిత్ షాకు నాలుగు సార్లు ఫోన్ చేశానని చెబుతున్నారని మమతా బెనర్జీ అన్నారు. ఇదంతా అబద్ధం..

Mamata Banerjee: అమిత్ షా‌కు ఫోన్ చేసినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. మమతా బెనర్జీ సవాలు
Mamata Banerjee
Image Credit source: TV9 Telugu
Follow us on

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు తాను ఫోన్‌ చేసి మాట్లాడినట్లు నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సవాల్ చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) జాతీయ పార్టీ హోదా కోల్పోవడంతో దానిని పునరుద్ధరించాలంటూ అమిత్‌ షాకు మమతా బెనర్జీ ఫోన్‌ చేశారంటూ బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించడంపై మండిపడ్డారు.  దీంతో మమతా బెనర్జీ దీనిపై బుధవారం స్పందించారు. ఇది తెలిసి తాను ఆశ్చర్యపోవడంతోపాటు షాక్‌ అయ్యానని అన్నారు. తృణమూల్ జాతీయ పార్టీ హోదా గురించి అమిత్ షాకు ఫోన్‌ చేసినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానంటూ సవాల్ చేశారు. ఇన్ని అసత్యాలు ప్రచారం చేసిన వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. ఇలా మాట్లాడే వారి నుంచి ఈ అబద్ధానికి క్షమాపణలు చెప్పిస్తామని అన్నారు.

కాగా, వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కలిసివచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రయత్నాలపై కూడా మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు మౌనం బంగారం. ప్రతిపక్షం కలిసి కూర్చోని మాట్లాడుకోవని అనుకోవద్దు. మేమంతా కలిసే ఉన్నాం.. అందరూ ఒకరితో ఒకరు సంబంధాలు కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు. సమయం వచ్చినప్పుడు గాలివానలా మారుతామని హెచ్చరించారు.

“నా పార్టీ పేరు TMC”

ఇది ఎవరి దయ వల్ల మనకు దక్కలేదని బెంగాల్ ముఖ్యమంత్రి అన్నారు. ఇంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న తర్వాత బీజేపీని వ్యతిరేకిస్తున్నందున మాకు ఇది ఇవ్వలేదు. నా పార్టీ పేరు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 200 సీట్ల సంఖ్యను దాటదని జోస్యం చెప్పారు సీఎం మమతా బెనర్జీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం