Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ప్రధాని మోదీ ఫోన్‌.. ఎందుకో తెలుసా..?

PM Modi - Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. మల్లికార్జున్‌ ఖార్గేకు ఫేస్‌మేకర్‌ ఇంప్లాంటేషన్‌ విజయవంతం అయ్యింది. దీంతో ఆయన ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఆయన..

Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ప్రధాని మోదీ ఫోన్‌.. ఎందుకో తెలుసా..?

Updated on: Oct 02, 2025 | 12:19 PM

Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ విజయవంతంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనతో ఫోన్‌లో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఎక్స్-సైట్‌లో ఖర్గే ఆరోగ్యం గురించి సమాచారాన్ని పంచుకున్న ప్రధాని.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన కుమారుడు, మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా మల్లికార్జున్ ఖర్గే ఆరోగ్యంగానే ఉన్నారని తెలియజేశారు.

నేను మల్లికార్జున్ ఖర్గేతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాను. అలాగే ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని, దీర్ఘాయుష్షు పొందాలని ప్రార్థిస్తున్నాను అని ప్రధాని మోడీ X సందేశంలో పేర్కొన్నారు.

 

కాగా, మల్లికార్జున్ ఖర్గే బుధవారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేరారు. ప్రియాంక్ ఖర్గే తరువాత ఈ సంఘటన గురించి తెలియజేసి, తన తండ్రి పేస్‌మేకర్ అమర్చడం కోసం ఆసుపత్రిలో చేరారని చెప్పారు.

మల్లికార్జున్ ఖర్గేకు పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ విజయవంతంగా జరిగింది. ఇది ఒక చిన్న ప్రక్రియ,అతని ఆరోగ్యం స్థిరంగా ఉంది. రెండు మూడు రోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ రాజకీయాల్లో చురుకుగా పాల్లొంటారు. మీ అందరి ఆందోళన, మద్దతుకు ధన్యవాదాలు అని ప్రియాంక్ ఖర్గే X సందేశంలో పేర్కొన్నారు.

 

వయసు సంబంధిత సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నందున మల్లికార్జున్ ఖర్గేకు పేస్‌మేకర్ అమర్చుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఆయన హృదయ స్పందన రేటును స్థిరీకరించడానికి ఇది అవసరమని వారు చెప్పారు. అంతే కాకుండా ఎటువంటి సమస్య లేదు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని ప్రియాంక్ ఖర్గే తెలిపారు. మంగళవారం యథావిధిగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్న మల్లికార్జున్ ఖర్గేకు తరువాత శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తడంతో పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ కోసం ఆసుపత్రిలో చేరారు.