Corona free village : మీ గ్రామాన్ని ‘కరోనా ఫ్రీ’గా చేసుకోండి, రూ. 50 లక్షలు బహుమతి పొందండి.. మహారాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రకటన

|

Jun 02, 2021 | 7:20 PM

రాష్ట్రంలో వైరల్ సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి కొన్ని గ్రామాలు చేసిన ప్రయత్నాలకు విపరీతంగా ఆకర్షితులైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే “మై విలేజ్ కరోనా ఫ్రీ” పోటీని..

Corona free village :  మీ గ్రామాన్ని కరోనా ఫ్రీగా చేసుకోండి, రూ. 50 లక్షలు బహుమతి పొందండి..  మహారాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రకటన
Uddhav Thackeray
Follow us on

Make your village ‘corona free’ : గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్ -19 వ్యాప్తిని అరికట్టే చర్యలను ప్రోత్సహించే లక్ష్యంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “కరోనా ఫ్రీ విలేజ్” పేరిట ఒక పోటీని ప్రకటించింది. రాష్ట్రంలో వైరల్ సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి కొన్ని గ్రామాలు చేసిన ప్రయత్నాలకు విపరీతంగా ఆకర్షితులైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే “మై విలేజ్ కరోనా ఫ్రీ” పోటీని రాష్ట్రవ్యాప్తంగా ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హసన్ ముష్రిఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ విభాగంలో కొవిడ్ -19 నిర్వహణలో మంచిగా పని చేస్తున్న మూడు గ్రామ పంచాయతీలకు బహుమతులు ఇవ్వబడతాయని మంత్రి పేర్కొన్నారు.

గెలిచిన గ్రామాలకు మొదటి బహుమతి రూ. 50 లక్షలు, రెండవది రూ. 25 లక్షలు, మూడవ బహుమతి రూ. 15 లక్షలుగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆరు రెవెన్యూ విభాగాలు ఉండగా, మొత్తం 18 బహుమతులు ఇస్తారు. ఇందుకోసం రూ. 5.4 కోట్లు ప్రైజ్ మనీగా ఖర్చు చేస్తారు. పోటీలో గెలిచిన గ్రామాలకు బహుమతి డబ్బుతోపాటు, దానికి సమానమైన అదనపు మొత్తాన్ని ప్రోత్సాహంగా ఇస్తారని.. ఆ నిధులు గ్రామాల్లోని అభివృద్ధి పనులకు మరింత ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ఈ కాంటెస్ట్ లో పాల్గొనే గ్రామాలు నిర్ధేశిత 22 ప్రమాణాలల్లో విజేతగా నిలవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.

కరోనా ఫ్రీ విలేజ్ గ్రామాలను నిర్ధారించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా, మంగళవారం నాడూ మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగింది. నిన్న రాష్ట్రంలో 14,123 కొత్త కొవిడ్ – 19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 57, 61, 015 కు చేరుకోగా, మొత్తం మరణాల సంఖ్య 96,198 కు పెరిగింది.

Read also : Vijayasai reddy : ‘తను చక్రం తిప్పినన్ని రోజులు వదిలేసి, ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఇప్పుడు తీర్మానమేంటి.? ‘ : విజయసాయి