జమ్మూ కాశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలో భారీ ఉగ్రదాడి యత్నాన్ని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు భగ్నం చేశాయి. ఈ జిల్లాలోని సంగాడ్ గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు రహస్యంగా దాచిన పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఆయుధాల్లో రెండు ఏకే 47 రైఫిల్స్, నాలుగు ఏకే 47 మేగజైన్లు, ఓ చైనీస్ పిస్టల్, 10 పిస్టల్ మేగజైన్లు, ఇంకా మందుగుండు సామగ్రి ఉన్నట్టు వారు వెల్లడించారు. గత రెండు మూడు రోజులుగా పోలీసులు, తాము ఈ ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్య;లు చేపట్టామని..ఈ సందర్భంగా వీటిని కనుగొన్నామని వారు చెప్పారు. మరిన్ని గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. ఇదే సమయంలో కిష్ట వర్ జిల్లాలో హిజ్ బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు టెర్రరిస్టులను కూడా భద్రతా దళాలు అరెస్టు చేశాయి. వీరి నుంచి కూడా భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
దేశ స్వాతంత్య్ర దినోత్సవం సమీసిస్తున్న సందర్భంగా జమ్మూ కాశ్మీర్ లోను, ఇతర చోట్ల ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడే ప్రమాదం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికతో…. సైన్యంతో సహా అన్ని దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన అధికారులు నిన్న జమ్మూ కాశ్మీర్ అంతటా జమాతే ఇస్లామీ అనుబంధ సంస్థల సభ్యుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. పోలీసులు కూడా ఈ దాడుల్లో వీరికి సహకరించారు. ఉగ్రవాదులకు రహస్యంగా సాయపడేవారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : తండ్రికి తగ్గ తనయుడిగా..కర్రసాము వీరుడిగా..పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్…:Akira Nandan Martial Arts video.