Maternity Leaves: విద్యార్థినులకూ మాతృత్వ సెలవులు.. దేశంలోనే తొలిసారి.. కండీషన్స్ అప్లై..

|

Dec 24, 2022 | 7:23 PM

ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పని చేసే మహిళలకు మాతృత్వ సెలవులు ఇవ్వడం తెలిసిందే. కంపెనీని బట్టి, వాటి హెచ్ఆర్ రూల్స్ ను అనుసరించి.. సెలవులు ఇచ్చే విధానంలో చిన్న చిన్న తేడాలుంటాయి. సాధారణంగా...

Maternity Leaves: విద్యార్థినులకూ మాతృత్వ సెలవులు.. దేశంలోనే తొలిసారి.. కండీషన్స్ అప్లై..
mushrooms for pregnant women
Follow us on

ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పని చేసే మహిళలకు మాతృత్వ సెలవులు ఇవ్వడం తెలిసిందే. కంపెనీని బట్టి, వాటి హెచ్ఆర్ రూల్స్ ను అనుసరించి.. సెలవులు ఇచ్చే విధానంలో చిన్న చిన్న తేడాలుంటాయి. సాధారణంగా మహిళలు గర్భంతో ఉన్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పని భారం, ఒత్తిడి పడకుండా కేర్ తీసుకోవాలి. అంతే కాకుండా అమ్మతనాన్ని ఆస్వాదించడంతో పాటు తమ పిల్లల సంరక్షణ కోసం ఈ సెలవులు ఇస్తుంటారు. ఇవి మహిళలకు ఎంత గానో ఉపయోగపడతాయి. అయితే.. కొన్ని సంస్థలు పురుషులకూ పితృత్వ సెలవులను ఇస్తున్నాయి. పిల్లలు పుట్టిన తర్వాత వారి బాగోగులు చూసుకునేందుకు ఈ విధానం తోడ్పడుతుంది. కానీ, దేశంలోనే తొలిసారిగా కాలేజీలో చదివే విద్యార్థినులకూ మాతృత్వ సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది మహాత్మా గాంధీ యూనివర్సిటీ. గర్భంతో ఉన్న విద్యార్థినుల చదువులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ సెలవులు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

కేరళ కొట్టాయంలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం లో డిగ్రీ, పీజీ విద్యార్థినులకు 60 రోజుల మాతృత్వ సెలవులు ఇవ్వనున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. గర్భం దాల్చిన విద్యార్థినులు ఈ సెలవులను ప్రసవానికి ముందు లేదా తర్వాత తీసుకోవచ్చు. అయితే తొలి లేదా రెండో కాన్పుకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి. కోర్సులో ఒకసారి మాత్రమే వీటిని ఉపయోగించుకోవాలి. ఇక.. గర్భస్రావం, ట్యూబెక్టమీ కేసుల్లో 14 రోజులు మంజూరు చేయనున్నారు.

గర్భధారణ కారణంగా విద్యార్థినుల చదువులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. సెమిస్టర్‌ మధ్యలో మాతృత్వ సెలవులు తీసుకున్న విద్యార్థినులు ఆ తర్వాత పరీక్షలు రాసేందుకు అనుమతి ఉంటుంది. దీనివల్ల ఆ విద్యార్థినులు సెమిస్టర్‌ను నష్టపోకుండా ఉంటారు.

ఇవి కూడా చదవండి

     – యూనివర్సిటీ విడుదల చేసిన ప్రకటనలో సారాంశం

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..