మహారాష్ట్రలో కోవిడ్ లాక్ డౌన్ నిబంధనల అతిక్రమణ, 3 లక్షల కేసుల ఉపసంహరణ, మరిన్ని కేసులను రద్దు చేస్తాం
మహారాష్ట్రలో కోవిడ్ లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారిపై పెట్టిన 3 లక్షల కేసులను ప్రభుత్వం ఉపసంహరించింది. ఐపీసీలోని 188 సెక్షన్ కింద..
మహారాష్ట్రలో కోవిడ్ లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారిపై పెట్టిన 3 లక్షల కేసులను ప్రభుత్వం ఉపసంహరించింది. ఐపీసీలోని 188 సెక్షన్ కింద ఈ కేసులు నమోదు చేశారు. గత ఏడాది మార్చి నుంచి అనేకమంది లాక్ డౌన్ రూల్స్ ని ఉల్లంఘించారని, వారిపై కేసులను ఉపసంహరిస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు. గత ఏడాది మార్చి 23 న రాష్ట్రంలో పూర్తి లాక్ డౌన్ విధించారు. 44 పోలీసు స్టేషన్ల పరిధుల్లో నిషేధాజ్ఞలు విధించారు. ఆ తరువాత లాక్ డౌన్ ని వివిధ దశల్లో ఎత్తివేస్తున్నప్పుడు ఆయా సందర్భాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడునిబంధనలను సమీక్షిస్తు వచ్చా మని ఆయన చెప్పారు. కోవిడ్ 19 బారి నుంచి దేశం కోలుకొంటున్నందున ఈ కేసులను ఎత్తివేస్తున్నామని ఆయన అన్నారు. పైగా ఎకనామిక్ యాక్టివిటీ కూడా పుంజుకోవలసి ఉందన్నారు. త్వరలో మరిన్ని కేసులను ఉపసంహరించే అవకాశం ఉందని అనిల్ దేశ్ ముఖ్ వెల్లడించారు.