Maharastra: స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 22 మంది కార్మికులకు తీవ్ర గాయాలు

|

Aug 24, 2024 | 8:28 PM

గాయపడిన వారిని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.ఇక్కడి కర్మాగారంలో స్క్రాప్ నుండి స్టీల్ కడ్డీలను తయారు చేస్తుంటారని తెలిసింది. గాయపడిన కార్మికుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు. కంపెనీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Maharastra: స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 22 మంది కార్మికులకు తీవ్ర గాయాలు
Boiler Explosion
Follow us on

మహారాష్ట్రలో భారీ పేలుడు సంభవించింది. జాల్నాలోని స్టీల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి 22 మందికి తీవ్ర గాయాలైనట్టు పోలీసలు తెలిపారు.. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసు సూపరింటెండెంట్ అజయ్ కుమార్ బన్సాల్ తెలిపారు. గజ్‌కేసరి స్టీల్‌ మిల్లులో మధ్యాహ్న సమయంలో జరిగిన పేలుడు కారణంగా కరిగిన ఇనుము కార్మికులపై పడిందని తెలిపారు.

ముగ్గురు కూలీల పరిస్థితి విషమంగా ఉండడంతో ఛత్రపతి శంభాజీనగర్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.ఇక్కడి  కర్మాగారంలో స్క్రాప్ నుండి స్టీల్ కడ్డీలను తయారు చేస్తుంటారని పోలీసుల విచారణలో తెలిసింది. గాయపడిన కార్మికుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేస్తున్నారని మరో అధికారి తెలిపారు. కంపెనీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ మూడు రోజలు క్రితం భారీ ప్రమాదం సంభవించింది. అనకాపల్లి జి‌ల్లాలోని అచ్యుతాపురంలోని ఎసెన్షియా అడ్వాన్స్‌డ్‌ సైన్సెస్‌ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్‌లోని మిశ్రమం ఎలక్ట్రికల్ ప్యానల్‌పై పడటంతో ఏసీ యూనిట్లకు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో మంటలు విస్తరించి, అంతటా అంటుకుని పేలుడు సంభవించింది. దీంతో గోడలు, ఏసీ యూనిట్లు కూలి కింద పనిచేస్తున్న కార్మికులపై పడిపోయాయి. పేలుడు ధాటికి అక్కడ పనిచేసే కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. ఈ పేలుడు ఘటనలో ఇప్పటివరకు 18 మంది మృతి చెందగా, మరో 36 మంది గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..