AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెల్లవారుజామున కారు బీభత్సం.. మార్నింగ్ వాకర్‌ను బలిగొన్న ఇన్నోవా!

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని జపనీస్ గార్డెన్ రోడ్డులో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు మార్నింగ్ వాక్ చేస్తున్న ఓ వృద్ధుడిని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం అనంతరం కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీకొట్టింది.

తెల్లవారుజామున కారు బీభత్సం.. మార్నింగ్ వాకర్‌ను బలిగొన్న ఇన్నోవా!
Car Hit Man Nagpur
Balaraju Goud
|

Updated on: Aug 30, 2026 | 11:13 AM

Share

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని జపనీస్ గార్డెన్ రోడ్డులో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు మార్నింగ్ వాక్ చేస్తున్న ఓ వృద్ధుడిని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం అనంతరం కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీకొట్టింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో ఇన్నోవా కారు అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం కారులో ఓ వ్యక్తి చిక్కుకుపోగా.. పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి ముందు మూడు కార్లు రేసింగ్ తరహాలో ఒకదానితో ఒకటి పోటీపడుతూ ప్రయాణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఇన్నోవా అదుపుతప్పి మార్నింగ్ వాకర్‌ను ఢీకొట్టినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

మరోవైపు కారులో ఉన్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. వారి మద్యం సేవించిన స్థితిని నిర్ధారించేందుకు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మూడు కార్లు నిజంగానే రేసింగ్‌లో పాల్గొన్నాయా? ఇన్నోవా ఎంత వేగంతో ప్రయాణించింది? డ్రైవర్ ఎవరు? ప్రమాద సమయంలో కారులో ఎంతమంది ఉన్నారు? మద్యం సేవించారా? అనే అంశాలపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us