వైద్య పరీక్షల కోసం ఎండలో 7 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణి.. వడదెబ్బతో మృతి

|

May 15, 2023 | 6:38 PM

భానుడి భగభగలు దేశ వ్యాప్తంగా ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 7 దాటిందంటే బయట కాలు పెట్టలేని పరిస్థితి. తాజాగా ఓ గర్భిణీ ఎండలో 7 కిలోమీటర్లు నడిచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తుండగా వడదెబ్బకు గురై మరణించింది. ఈ హృదయ విదారక

వైద్య పరీక్షల కోసం ఎండలో 7 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణి.. వడదెబ్బతో మృతి
Pregnant Woman Dies Of Sunstroke
Follow us on

భానుడి భగభగలు దేశ వ్యాప్తంగా ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 7 దాటిందంటే బయట కాలు పెట్టలేని పరిస్థితి. తాజాగా ఓ గర్భిణీ ఎండలో 7 కిలోమీటర్లు నడిచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తుండగా వడదెబ్బకు గురై మరణించింది. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్రలో సోమవారం (మే 15) జరిగింది.

మహారాష్ట్రలోని పాల్ఘర్‌లోని ఓసర్ వీరా గ్రామానికి చెందిన సోనాలి వాఘాట్​( 21) అనే గర్భిణీ జనరల్ చెకప్​కోసం దండల్వాడి పీహెచ్‌సీకి బయల్దేరింది. ఆమె గ్రామం నుంచి 3.5 కిలోమీటర్లు నడిచి హైవేకు చేరుకుని, అక్కడి నుంచి ఆమె ఆటోలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. వైద్య చేయించుకున్న తర్వాత తిరిగి ఇంటికి ఆటోలో బయలుదేరింది. ఈ క్రమంలో హైవేపై దిగింది. అప్పటికే ఎండ తీవ్రంగా ఉండటంతో మెల్లగా కాలి నడకన నడుచుకుంటూ ఇంటికి చేరుకుంది.

ఐతే ఇంటికి చేరుకున్న కాసేపటికే వడదెబ్బ వల్ల సోనాలి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సబ్ డివిజనల్ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే సోనాలి మరణించింది. ఆమె కడుపులో ఉన్న గర్భస్థ శిశువు కూడా ప్రాణాలు కోల్పోయింది. తీవ్రమైన ఎండలో 7 కి.మీ నడవడం వల్ల ఆమె వడదెబ్బకు గురైందని, బాధితురాలికి రక్త హీనత వ్యాధి కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.