Maharashtra Crisis: శివసేన కీలక నిర్ణయం.. 12 మంది రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సిఫారసు..

|

Jun 24, 2022 | 12:12 AM

శివసేన మరో కీలక నిర్ణయం తీసుకుంది.. 12 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శివసేన (shivsena) మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాసింది.

Maharashtra Crisis: శివసేన కీలక నిర్ణయం.. 12 మంది రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సిఫారసు..
Uddhav Thackeray
Follow us on

Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటుతో ఉద్ధవ్‌ సర్కార్‌ మైనార్టీలో పడిపోయింది. అన్నిదారులూ మూసుకుపోవడంతో ఉద్ధవ్ గద్దె దిగేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో శివసేన మరో కీలక నిర్ణయం తీసుకుంది.. 12 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శివసేన (shivsena) మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాసింది. బుధవారం జరిగిన సమావేశానికి హాజరు కానందున 12 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాసినట్లు శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం రాత్రి ముంబైలో మీడియాతో మాట్లాడారు.

అనర్హత వేటుకు ప్రతిపాదించిన శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో.. ఏకనాథ్ షిండే, ప్రకాష్ సర్వే, తానాజీ సావంత్, మహేశ్ షిండే, అబ్దుల్ సత్తార్, సందీప్ భూమారే, భరత్ గోగావాలే, సంజయ్ శిర్సత్, యామినీ యాదవ్, అనిల్ బాబర్, బాలాజీ దేవదాస్, లతా చౌదరి ఉన్నారు. కాగా.. అనర్హత వేటుకు సంబంధించి మరికొందరి పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం..

ఇవి కూడా చదవండి

పార్టీ నాయకుడిగా నియమించండి.. ఏక్‌నాథ్ షిండే లేఖ..

కాగా.. శివసేన లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా తన నియామకాన్ని పునరుద్ఘాటించడంతోపాటు పార్టీ చీఫ్ విప్‌గా భరత్‌షేత్ గోగావాలేను నియమించడంపై రెబల్ శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో 37 మంది శివసేన ఎమ్మెల్యేల సంతకాలు ఉన్నాయి. ఈ లేఖను డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, శాసనమండలి కార్యదర్శి రాజేంద్ర భగవత్‌లకు పంపారు.

కాగా.. శివసేన నుంచి ఒక్కొక్కరుగా షిండే రెబల్‌ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే 37 మంది ఎమ్మెల్యేలు గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకోగా.. తాజాగా మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు శిబిరానికి వెళ్లారు. దీంతో ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde)తో కలుపుకొని మొత్తం రెబల్‌ ఎమ్మెల్యేల సంఖ్య 39కి చేరింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..