కొత్తగా కారు కొనాలనుకునే వారికి షాకింగ్‌ న్యూస్‌..! మహా సర్కార్‌ నయా రూల్‌.. ఏంటంటే..

భారతదేశంలో కిలోమీటరుకు అత్యధిక వాహన సాంద్రత కలిగిన నగరాల్లో ముంబై నగరం కూడా ఒకటి. కానీ, ఈ పెరుగుదలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు తగినంతగా లేకపోవడంతో ఎక్కడికక్కడ వాహనాల రద్దీ ఏర్పాడుతోంది. ఇప్పటికే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లకు పార్కింగ్ డాక్యుమెంటేషన్ తప్పనిసరి చేస్తూ చెన్నై పార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలు పార్కింగ్‌కు సంబంధించిన పట్టణ సమస్యలను పరిష్కరించడానికి ఇలాంటి చర్యల గురించి చర్చించాయి.

కొత్తగా కారు కొనాలనుకునే వారికి షాకింగ్‌ న్యూస్‌..! మహా సర్కార్‌ నయా రూల్‌.. ఏంటంటే..
No Parking No Car

Updated on: May 21, 2025 | 9:04 PM

కొత్తగా కారు కొనాలని అనుకునే వారికి మహా సర్కార్ బిగ్ షాకిచ్చింది. ‘నో పార్కింగ్, నో కార్’ అనే కొత్త రూల్ ను తీసుకువచ్చింది. ఈ నియమం ప్రకారం, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు ముందు సంబంధిత అధికారుల నుంచి పార్కింగ్ స్పేస్ ప్రూఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. పార్కింగ్ స్థలం లేకపోవడం వలన రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ఓపెన్ స్పేస్‌లు కార్లతో నిండిపోతున్నాయని, అందుకే ఈ రూల్ తీసుకొచ్చినట్లు ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR)లో ట్రాఫిక్ రద్దీ, కార్ పార్కింగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సరికొత్త విధానాన్ని అమలు చేయబోతోంది.

భారతదేశంలో కిలోమీటరుకు అత్యధిక వాహన సాంద్రత కలిగిన నగరాల్లో ముంబై నగరం కూడా ఒకటి. కానీ, ఈ పెరుగుదలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు తగినంతగా లేకపోవడంతో ఎక్కడికక్కడ వాహనాల రద్దీ ఏర్పాడుతోంది. ఈ క్రమంలోనే మహా సర్కార్‌ ఇలాంటి సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.

ఇప్పటికే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లకు పార్కింగ్ డాక్యుమెంటేషన్ తప్పనిసరి చేస్తూ చెన్నై పార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలు పార్కింగ్‌కు సంబంధించిన పట్టణ సమస్యలను పరిష్కరించడానికి ఇలాంటి చర్యల గురించి చర్చించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..