ఇదెక్కడి విచిత్రం రా బాబు.. ఏడేళ్ల క్రితం పూడ్చిపెట్టిన మహిళ శవాన్ని బయటకు తీసి..
ఏడేళ్ల క్రితం పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని తవ్వి తీసిన ఓ యువకుడు. ఆ అస్థిపంజరంతో సెల్ఫీ తీసుకున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు ఆగ్రహంతో ఆ యువకుడిని చితకబాదారు. అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులపై సైతం రాళ్లురువ్వారు. ఈ వింత ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ఒక యువకుడు ఏడేళ్ల క్రితం పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని తవ్వి తీసి.. ఆ అస్థిపంజరంతో సెల్ఫీ తీసుకున్న ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా నగరంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..మేదినీపూర్ జిల్లాలో కాంటాయ్ గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే ఓ యువకుడు మద్యానికి బానిసై తాగుతూ ఉండే వాడు. ఈ వ్యసనం కారణంగానే అతను ఉద్యోగం కూడా కోల్పొయాడు. అయితే ఈ యువకుడు ఒక రోజు ఏడేళ్ల క్రితం పూడ్చిపెట్టిన ఓ మహిళ మృతదేహాన్ని తవ్వి బయటకు తీశాడు. తర్వాత ఆ అస్థిపంజరంతో సెల్ఫీతీసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని పట్టుకున్నారు. ఆగ్రహంతో అతన్ని కొట్టడం స్టార్ట్ చేశారు.
అయితే, అక్కడ గొడవ జరుగుతున్న సమాచారం అందుకున్న స్థానికి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం నెలకొంది. అయితే ఆ యువకుడిని పోలీసులకు అప్పగించడానికి నిరాకరించిన గ్రామస్తులు..ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురు పోలీసులకు గాయాలు కూడా అయినట్టు తెలుస్తోంది.
అయితే గ్రామస్తుల నుంచి ఆ యువకుడిని రక్షించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. సుమారు రెండు గంటల వాగ్వాదం తర్వాత పరిస్థితి సద్ధుమణగడంతో గ్రామవస్తుల నుంచి ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఘటనా స్థలంలో మద్యం బాటిల్స్ ఉండడంతో ఆ యువకుడు తాగిన మత్తులోనే ఆ మహిళ మృతదేహాన్ని తవ్వి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఆ యువకుడు సమాధి నుండి మహిళ అస్థిపంజరాన్ని ఎందుకు బయటకు తీశాడో అనేది మాత్రం ఇంత వరకు తెలియలేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




