Nasik Apples : కాశ్మీర్ , సిమ్లా యాపిల్స్ తో పాటు ఇక నుంచి నాసిక్ యాపిల్స్ కూడా వస్తున్నాయి

|

Jun 16, 2021 | 5:40 PM

Maharashtra:  భారత దేశంలో ఆపిల్ పండ్లు అంటే వెంటనే గుర్తుకొచ్చే ప్రాతం.. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లు. ఈ రాష్ట్రాలకు, ఆపిల్స్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. అయితే ఇప్పుడు ఈ యాపిల్స్..

Nasik Apples : కాశ్మీర్ , సిమ్లా యాపిల్స్  తో పాటు ఇక నుంచి నాసిక్ యాపిల్స్ కూడా వస్తున్నాయి
Nasik Appales
Follow us on

Maharashtra:  భారత దేశంలో ఆపిల్ పండ్లు అంటే వెంటనే గుర్తుకొచ్చే ప్రాతం.. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లు. ఈ రాష్ట్రాలకు, ఆపిల్స్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. అయితే ఇప్పుడు ఈ యాపిల్స్ ను మహారాష్ట్రలోని నాసిక్ లో కూడా పండిస్తున్నాడు ఓ రైతు. నిజానికి నాసిక్ ద్రాక్ష, దానిమ్మ పంటలకు ప్రసిద్ధి. అయితే శీతల వాతావరణంలో పండించే ఉద్యానవన పంట యాపిల్ ను నాసిక్ కు చెందిన రైతు పండించాలని అనుకున్నాడు.

సతానా తాలూకాలోని అఖత్వాడే గ్రామానికి చెందిన హయాలిజ్ తన భౌమిలో 25 నుండి 30 ఆపిల్ మొక్కలను నాటాడు. అవి ఇప్పుడు కాపుకాశాయి. ఇదే విషయంపై ఆ రైతు స్పందిస్తూ.. తనకు దానిమ్మ , ద్రాక్ష తోటలు కూడా అయితే అవి కాకుండా వేరే పండించాలని అనుకున్నానని చెప్పాడు. అప్పుడు ఆపిల్ పెంపకాన్ని ఎంచుకున్నానని ఇప్పుడు తాను సాధించిన విజయంతో సంతృప్తి చెందుతున్నాను” అని మిస్టర్ హయాలిజ్ చెప్పాడు. నాసిక్ జిల్లా నుండి వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతాయి. ముఖ్యంగా నాణ్యమైన ద్రాక్ష, దానిమ్మలను ఉత్పత్తి ఎగుమతి చేయడానికి ప్రసిద్ధి చెందాయి.

అయితే ప్రస్తుతం దానిమ్మపండ్లపై ” మార్ ” , ” టెలియా ” వ్యాధుల సోకుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలోని చాలా మంది రైతులు ఉల్లి పంటలను పండిస్తున్నారు. అయితే అందరికంటే భిన్నంగా హయాలిజ్ తన పొలంలో ఆపిల్ పండించాలని నిర్ణయించుకున్నాడు అతని ప్రయోగం విజయవంతం కావడంతో ప్రస్తుతం జిల్లాలో ఒక ట్రెండ్సెట్టర్ అయ్యాడు, చాలా మంది వ్యవసాయదారులు ఆపిల్ పెంపకాన్ని చేపట్టాలని ఆలోచిస్తున్నారు.

Also Read: 35 వేలు పెట్టి బెల్ట్ కొన్న కూతురు .. దానికి రూ 150 ఎక్కువ అంటున్న తల్లి.. ఫన్నీ వీడియో వైరల్