Maharashtra Minister: కరోనా వైరస్ విజృంభణ అడ్డుకోవడానికి కరోనా నిబంధనలు తప్పనిసరి అంటూ గత రెండేళ్లుగా ప్రభుత్వాలు, అధికారులు చెబుతూనే ఉన్నారు. మాస్కులు, శానిటైజ్ వంటి వాటితో పాటు.. ఎక్కువ మంది ఒక చోట గుంపులుగా ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అయితే వివాహ వేడుక జీవితంలో ఒకసారి వచ్చేది.. అంటూ పరిమితిమించి బంధువులను, స్నేహితులను పిలిచి..అనేక మంది కరోనా వ్యాధి బారిన పడడానికి కారణంగా మారిన పెళ్లిళ్ల సంఘటనలు గురించి చాలా విన్నాం.. అయితే ఓ రాష్ట్రానికి మంత్రి.. ఒక్కగానొక్క కూతురు పెళ్లి.. అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలను జరిగిపించే హోదా ఉన్నా.. చాలా సింపుల్ గా కూతురు పెళ్లి చేసి.. పదిమందికి ఆదర్శంగా నిలిచారు ఆ రాష్ట్ర హోమ్ మంత్రి జితేంద్ర అవ్హాడ్ . వివరాల్లోకి వెళ్తే..
ఒమిక్రాన్ మహమ్మారి భయాల నేపథ్యంలో మహారాష్ట్రలో ఆ రాష్ట్ర మంత్రి తన కూతురి వివాహాన్ని సాదాసీదాగా జరిపించి ఆదర్శంగా నిలిచారు. తాజాగా రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవ్హాడ్ తన కూతురు నతాషా అవ్హాడ్‌కు రిజిస్టర్ వివాహం జరిపించారు. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా జరిగిన ఈ పెళ్లికి కేవలం ఆయన కుటుంబ సభ్యులు, కొందరు ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. మంత్రి హోదాలో ఉండి కూడా తన ఏకైక కూతురి వివాహాన్ని నిరాడంబరంగా జరిపించిన మంత్రి జితేంద్ర అవ్హాడ్‌ను ఈ సందర్భంగా పలువురు అభినందించారు.
కాగా.. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు పెరగ్గా.. తాజాగా మహారాష్ట్రలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటి వరకు మహారాష్ట్ర మొత్తం మీద ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 10కి చేరాయి.
Also Read: ఆదేశంలో భారీగా కరోనా ఒమిక్రాన్ కేసులు.. టీకాలు తీసుకోకుంటే ఆ పరిస్థితి తప్పదంటున్న ప్రభుత్వం..