పంట నష్టపోయిన ఓ రైతు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. పంట దెబ్బతినడంతో మనస్తాపానికి గురైన రైతు బలవన్మరణానికి పాల్పడినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇప్పుడు చనిపోయిన రైతు కుమార్తె ముఖ్యమంత్రి షిండేకు లేఖ రాసింది. ఆ లేఖ చదివిన ప్రతి ఒక్కరూ చలిపోయారు. ఆ చిన్నారి మాటలకు ఎవరైనా సరే కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. మా నాన్నను వెనక్కి పంపమని దేవుడిని అడగండి..అంటూ ఆ అమ్మాయి రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసింది. ఈ హృదయ విదారక సంఘటన మహారాష్ట్రాలో చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో పంట చేతికి రాకపోవడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రైతు సెగావ్ ఖోడ్కే గ్రామ నివాసి. మృతిచెందిన రైతుకు భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సెగావ్‌కు చెందిన రైతు నారాయణ్ ఖోడ్కే వ్యవసాయంలో నష్టాలు, అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. మరణించిన రైతు నారాయణ్ కుమార్తె కిరణ్ ఖోడ్కే ఇప్పుడు తన తండ్రిని ఇంటికి పంపాలని కోరుతూ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేకు లేఖ రాశారు. కిరణ్ ఎనిమిదో తరగతి చదువుతుంది.
ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ చిన్నారి తన తండ్రి మరణం తట్టుకోలేక తల్లడిల్లిపోతుంది. నాన్నను తిరిగి తీసుకురావాలంటూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు లేఖ రాసింది. ఇందులో నాన్న దేవుడు తీసుకెళ్లాడని,.. తనను తిరిగి తమ ఇంటికి తీసుకురావాలంటూ వేడుకుండి. మా నాన్నను మా ఇంటికి పంపించండి..మీ కుమార్తె ఇంట్లో ఎదురు చూస్తుందని చెప్పండి అంటూ దీనంగా ప్రార్థించింది.
బాలిక ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు రాసిన లేఖలో..
”సార్! మీరు దసరా పండుగను ఘనంగా జరుపుకున్నారు. బహుశా మీ దీపావళి కూడా బాగుంటుంది. కానీ నా ఇంట్లో దసరా జరుపుకోలేదు. దీపావళి జరుపుకోలేము. నా తల్లి ఏడుస్తుంది. సోయాబీన్ ధరలు బాగుంటే మీ నాన్న చనిపోయి ఉండేవాడు కాదని ఆమె చెప్పింది. ఈ సంవత్సరం మా పొలంలో సోయాబీన్ తక్కువగా పంటకు తక్కువ ఆదాయం వచ్చింది. మా ఇంట్లో గొడవ జరిగింది. దాంతో మా నాన్న ఇంట్లోంచి వెళ్లిపోయారు.. కానీ, తిరిగి రాలేదు. నేను అమ్మమ్మని అడిగాను – నాన్న ఎక్కడికి వెళ్ళారని అడిగితే.. మీ నాన్న దేవుడి దగ్గరకు వెళ్ళారని చెప్పారు… సార్, దేవుడి ఇల్లు ఎక్కడ ఉంది? వారి నంబర్ ఇవ్వండి. నా తండ్రిని ఇంటికి పంపించు, దీపావళి వస్తోంది. మాకు ముగ్గురు అక్కలు, ఒక అన్న. ప్రతిరోజూ నాన్న రాక కోసం ఎదురుచూస్తుంటాం. కానీ అతను ఇంకా తిరిగి రాలేదని తన గొడును వెల్లబోసుకుంది.
నాన్న తిరిగి రాకపోతే మమ్మల్ని బజారుకు ఎవరు తీసుకెళతారు? బట్టలు ఎవరు కొనిస్తారు..? మీ నాన్న బయటకు వెళ్ళిపోతే..మీ ఇంట్లో దీపావళి జరుగుతుందా? ప్రభుత్వం వల్లే మీ నాన్న దేవుడి ఇంటికి వెళ్లాడని అంటున్నారు. ఇది నిజామా..? మా నాన్నని తిరిగి మా ఇంటికి పంపమని దేవుడిని అడగండి.. దీపావళికి మేమంతా షాపింగ్ చేయాలి..మీ కూతురు ఏడుస్తోందని చెప్పండి. అప్పుడు నాన్న త్వరగా వస్తాడని చెబుతూ లేఖ రాసింది.
ఈ అమాయకపు అమ్మాయి లేఖకు ఏక్‌నాథ్ షిండే ఏం సమాధానం ఇస్తారో చూడాలి. ఈ ఏడాది మహారాష్ట్రలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. పంటల బీమా అందుబాటులో లేదు. ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఎలాంటి సహాయం అందలేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..