Maharashtra Corona: మహారాష్ట్రలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!

Maharashtra Corona Updates: దేశంలో ఒక వైపు కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంటే మరో వైపు కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మహారాష్ట్రలో అయితే తీవ్ర స్థాయిలో కేసులు నమోదు..

Maharashtra Corona: మహారాష్ట్రలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!
Telangana corona

Updated on: Apr 26, 2021 | 9:54 PM

Maharashtra Corona Updates: దేశంలో ఒక వైపు కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంటే మరో వైపు కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మహారాష్ట్రలో అయితే తీవ్ర స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 48,700 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 524 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 43,43,727కు చేరగా, మొత్తం మరణాల సంఖ్య 65,284కు చేరింది.

మరోవైపు గ‌త 24 గంట‌ల్లో 71,736 మంది క‌రోనా రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ కాగా, క‌రోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 36,01,796కు చేరిన‌ట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాల్లో మ‌హారాష్ట్ర తొలి స్థానంలో కొనసాగుతోంది.

ఇక కరోనా కట్టడికి ఇప్పటికే మహారాష్ట్ర అనేక చర్యలు చేపడుతున్నా.. కేసులు, మరణాల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధిస్తోంది. మాస్క్‌ ధరించని వారికి జరిమానా విధిస్తోంది.

ఇవీ చదవండి:

AP Corona: కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి అవి మూసివేయాలని ఆదేశం

AP Corona Updates: ఏపీలో కరోనా విలయతాండవం.. గడిచిన 24 గంటల్లో 9,881 పాజిటివ్‌ కేసులు