Solar Industries blast: బొగ్గు ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు

|

Dec 17, 2023 | 3:29 PM

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న ఓ ఫ్యాక్టరీలో ఆదివారం (డిసెంబర్‌ 17) పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని బజార్‌గావ్ ప్రాంతంలో ఉన్న సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్‌లో ఆదివారం ఉదయం దాదాపు 9.30 గంటలకు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో..

Solar Industries blast: బొగ్గు ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు
Solar Industries Blast
Follow us on

నాగ్‌పూర్‌, డిసెంబర్‌ 17: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న ఓ ఫ్యాక్టరీలో ఆదివారం (డిసెంబర్‌ 17) పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని బజార్‌గావ్ ప్రాంతంలో ఉన్న సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్‌లో ఆదివారం ఉదయం దాదాపు 9.30 గంటలకు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో 12 మంది మాత్రమే ఫ్యాక్టరీలో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసు బృందం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. బొగ్గు బ్లాస్టింగ్ కోసం సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలోని కాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో పేలుడు పదార్థాలను ప్యాకింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దేశం రక్షణ విభాగానికి పేలుడు పదార్థాలు, ఇతర రక్షణ పరికరాలు సరఫరా చేయడంలో కంపెనీ కీలకంగా వ్యవహరిస్తుంది. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని నాగ్‌పూర్ (రూరల్) పోలీసు సూపరింటెండెంట్ హర్ష్ పొద్దార్ తెలిపారు.

ప్రయాణికులతో వెళ్తున్న బస్సుకు విడిపోయిన వెనుక టైర్లు.. టైర్లు లేకుండానే రోడ్డుపై పరుగులు తీసిన బస్సు

రోడ్డుపై వెళ్తున్న బస్సు వెనుక చక్రాలు ఊడిపోవడం కలకలం రేపింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని సేలం సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. సేలం ఎడప్పాడి సమీపంలోని వెల్లండి వలసకు చెందిన విజయన్‌ ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం సేలం కొత్త బస్‌ స్టేషన్‌ నుంచి ఎడప్పాడికి ప్రయాణికులతో బయల్దేరిన బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయి. దీంతో అరియలూర్‌ సమీపంలో బస్సు ముందు భాగం ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో అదుపుతప్పి కొద్ది దూరం వెళ్లింది. బస్సు వెనుక యాక్సిల్‌ విరిగిపోవడం వల్లనే వెనుక వైపు టైర్లు ఊడిపోయాయి. టైర్లు లేకుండానే బస్సు కొద్ది దూరం వెళ్లింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా భయాందోళలకు గురై కేకలు వేయసాగారు. వెంటనే డ్రైవర్‌ చాకచక్యంగా బస్సును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.