Earthquake: లడఖ్‌లో భూ ప్రకంపనలు.. ఇళ్లల్లో నుంచి పరుగులు తీసిన ప్రజలు..

|

Mar 06, 2021 | 9:21 AM

Earthquake in Ladakh: ఉత్తర భారతదేశంలో వరుసగా సంభవిస్తున్న భూకంపాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల ఢిల్లీ – ఎన్‌సీఆర్‌, నోయిడా, బీహార్ తదితర ప్రాంతాల్లో భూకంపం..

Earthquake: లడఖ్‌లో భూ ప్రకంపనలు.. ఇళ్లల్లో నుంచి పరుగులు తీసిన ప్రజలు..
earthquake hits in Ladakh
Follow us on

Earthquake in Ladakh: ఉత్తర భారతదేశంలో వరుసగా సంభవిస్తున్న భూకంపాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల ఢిల్లీ – ఎన్‌సీఆర్‌, నోయిడా, బీహార్ తదితర ప్రాంతాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఫిబ్రవరిలో కేంద్రపాలిత ప్రాంతమై లడఖ్‌లో సైతం భూ ప్రకంపనలు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలోనే తాజాగా శనివారం కూడా లడఖ్‌లో భూమి కంపించింది. తెల్లవారుజామున 5.11 గంటలకు భూ ప్రకంపనలు సంభించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. దీంతో లడఖ్, లేహ్ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా ప్రకంపంనలు రావడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్వల్పంగా భూమి కంపించడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఇప్పటివరకు ఎలాంటి వార్తలు రాలేదు.

ఇదిలాఉంటే.. ఉత్తర భారతదేశంలో వరుసగా సంభవిస్తున్న భూకంపాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల ఢిల్లీ – ఎన్‌సీఆర్‌, నోయిడా, బీహార్, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. అయితే స్వల్ప భూకంపాలతో ఎలాంటి ప్రమాదమీలేదని అధికారులు వెల్లడిస్తున్నారు.

Also Read:

Today Gold Price: భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?