Love Marriage: కులాంతరం వివాహం చేసుకుంటే తండ్రీకూతుళ్ల బంధం ముగిసిపోదు.. కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు..

కులాంతర వివాహాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లవ్ మ్యారెజ్.. కులాంతర పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత తండ్రీకూతుళ్ల బంధం ముగిసిపోదని పేర్కోంది.

Love Marriage: కులాంతరం వివాహం చేసుకుంటే తండ్రీకూతుళ్ల బంధం ముగిసిపోదు.. కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు..
High Court
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 23, 2022 | 9:12 PM

కులాంతర వివాహాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లవ్ మ్యారెజ్.. కులాంతర పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత తండ్రీకూతుళ్ల బంధం ముగిసిపోదని పేర్కోంది. పెళ్లయ్యాక కూడా ఆ కూతురికి తన తండ్రి బాధ్యత ఉంటుందని వ్యాఖ్యనించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ ఎంఎస్ భట్టిలు సమక్షంలో జరిగిన విచారణంలో అమ్మాయి పెద్దయ్యాక తనకు నచ్చినట్టుగా జీవించే స్వేచ్చ, హక్కు ఉంటుందని తెలిపారు. కూతురికి కులాంతర వివాహం అయిన తర్వాత కూడా ఆమెను రక్షించే బాధ్యత ఆ తండ్రికి ఉంటుందని.. తన కుమార్తెకు పూర్తిగా రక్షణ కల్పించడం తండ్రిగా వ్యవహరించాల్సిన బాధ్యత అని తెల్చీ చెప్పింది.

మధ్య ప్రదేశ్ హోషంగాబాద్‏కు చెందిన ఫైజల్ ఖాన్.. తన ప్రియురాలిని ఆమె కుటుంబసభ్యులు మహిళా ఆశ్రమంలో బంధించారని ఆరోపిస్తూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. తాము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని.. ప్రస్తుతం ఆమె వయసు 19 సంవత్సరాలను.. తన ప్రియురాలి కంటే తను వయసులో పెద్దవాడినని పేర్కోన్నాడు. జనవరి మొదటి వారంలో తన ప్రియురాలి ఇంటి నుంచి బయటకు వచ్చి తనతోపాటే నివసిస్తుందని తెలిపారు.

అయితే తన కూతురు కనిపించడం లేదని.. ఆ అమ్మాయి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులును వారిద్దరిని వెతికి పట్టుకోగా.. తామిద్దరం పరస్పరం అంగీకారం.. ఇష్టంతోనే కలిసి ఉంటున్నామని తెలిపారు. ఆ తర్వాత వారిద్దరు భోపాల్ వచ్చి నివసిస్తున్నారు. ఫిబ్రవరిలో ఇటార్సీ పోలీసులు ఎస్డీఎం ముందువారి స్టేట్ మెంట్ రికార్డ్ చేయడానికి పిలిపించారు. అదే సమయంలో అమ్మాయి తల్లితండ్రులు ఆమెను బలవంతగా మహిళ ఆశ్రమానికి పంపించారు. దీనిపై ఫైసల్ ఖాన్ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిగిన అనంతరం ఆ యువతి తన ప్రియుడితో కలిసి ఉంటానని చెప్పింది.

ఈ పిటిషన్ పై మంగళవారం జరిగిన విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆ అమ్మాయి వయసు 19 సంవత్సరాలు మాత్రమే అని.. విద్యాభ్యాసం పూర్తైన తర్వాత పెళ్లి జరిపించాలని.. కులాంతరం వివాహం జరిగిన తర్వాత కూడా కూతురు బాధ్యత తండ్రికి ఉంటుందని హైకోర్టు తెలిపింది. వివాహం జరిగిన తర్వాత తమ కూతురుకు ఎల్లప్పుడు రక్షణగా ఉంటూ తనకు ప్రేమను అందించాలని.. అలాగే ఆర్థిక సాయం కూడా చేయాల్సి ఉంటుందని హైకోర్టు తెలిపింది.

Also Read: Bheemla Nayak: భీమ్లా నాయక్‌ ట్రైలర్‌పై రామ్‌ చరణ్‌ ఏమన్నారో తెలుసా.? మెగా రివ్వ్యూ..

‘మాంగళ్యం తంతునానేనా మన లైఫ్ లో ఇది జరుగునా’.. ఆడవాళ్లు మీకు జోహార్లు కొత్త సాంగ్‌ విన్నారా.?

Keerthy Suresh: సూపర్ స్టైలీష్ లుక్‌లోఫ్యాన్స్ గుండెలను కొల్లగొడుతున్న కీర్తి సురేష్ లేటెస్ట్ పిక్స్

Ashu Reddy: లంగా వోణీ రచ్చ చేస్తున్న అషు రెడ్డి లేటెస్ట్ ఫోటోస్ వైరల్

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!