Govt Servants: ఆ సమయంలో సెల్ ఫోన్ వాడొద్దు.. ప్రభుత్వ ఉద్యోగులకు హై కోర్టు ఆదేశాలు..

|

Mar 15, 2022 | 2:13 PM

పని సమయంలో ఉద్యోగుల్లో పనికి బ్రేకులు వేస్తోంది ఈ సెల్ ఫోన్.. సొల్లు ఫోనుగా మారుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు కొందరు అదే పనిగా ఫోన్‌లో మునిగిపోవడాన్ని తమిళనాడు రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది.

Govt Servants: ఆ సమయంలో సెల్ ఫోన్ వాడొద్దు.. ప్రభుత్వ ఉద్యోగులకు హై కోర్టు ఆదేశాలు..
Govt Servants Mobile Phones
Follow us on

కాలం మారిపోయింది.. సెల్‌ఫోన్ దేహంలో భాగమైపోయింది.. ఫోన్ లేనిదే పొద్దు పోవడంలేదు.. అత్యవసర పనుల నుంచి.. సరదా కబుర్లకు కూడా సెల్ ఉండాల్సిందే..! ఇప్పుడు నిత్యావసరం అయిపోయింది. అది లేనిదే ముద్ద దిగడం లేదు. పెద్దలకు పనులు జరగడం లేదు. అయితే పని సమయంలో ఉద్యోగుల్లో పనికి బ్రేకులు వేస్తోంది ఈ సెల్ ఫోన్.. సొల్లు ఫోనుగా మారుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు కొందరు అదే పనిగా ఫోన్‌లో మునిగిపోవడాన్ని తమిళనాడు రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసుల సమయంలో వ్యక్తిగత అవసరాల కోసం సెల్ ఫోన్లను ఉపయోగించకూడదని మద్రాస్‌ హైకోర్టు కీలక కామెంట్స్ చేసింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్‌ను వెంటనే రూపొందించాలని.. రూల్స్‌ ఫాలో కానీ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని జస్టిస్‌ సుబ్రమణియన్‌ ఆ ఆదేశాల్లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి: Wi-Fi Repeater: వైఫై రూటర్‌‌కు ధీటుగా Wi-Fi రిపీటర్.. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఉందా..

Target 2024: మళ్లీ అధికారమే టార్గెట్‌గా వైసీపీ మాస్టర్ ప్లాన్.. జగనన్న ఏం చేయబోతున్నారో తెలుసా..