‘శివరాజ్ సింగ్ జీ ! మేం ముందే చెప్పాం’…కమల్ నాథ్

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్  కరోనా పాజిటివ్ లక్షణాలతో  ఆసుపత్రిలో చేరారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఆయనపై వరుస ట్వీట్లు చేశారు. ఇది సీరియస్ వ్యాధి అని తాము ముందే చెప్పామని, కానీ మీరు ఇదంతా నాటకమని కొట్టిపారేశారని..

శివరాజ్ సింగ్ జీ ! మేం ముందే చెప్పాం...కమల్ నాథ్

Edited By:

Updated on: Jul 25, 2020 | 5:35 PM

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్  కరోనా పాజిటివ్ లక్షణాలతో  ఆసుపత్రిలో చేరారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఆయనపై వరుస ట్వీట్లు చేశారు. ఇది సీరియస్ వ్యాధి అని తాము ముందే చెప్పామని, కానీ మీరు ఇదంతా నాటకమని కొట్టిపారేశారని ఆయన అన్నారు. కరోనాపై మేమంతా ఆందోళన చెందుతున్న సమయంలో.. దీన్ని మీరు తక్కువగా అంచనా వేసి ఎవరూ భయపడవద్దని చెప్పేవారు.. మా మీద ఏవేవో ఆరోపణలు చేసేవారు.. ఇప్పటికైనా ఈ కరోనా వైరస్ ని ‘మజాక్’ (తమాషా) అనుకోకండి అని కమల్ నాథ్ పేర్కొన్నారు. వ్యాధి నివారణకు ప్రోటోకాల్ పాటించాలని, మీరు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు.

అటు మరో మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలా ఉండగా దేశంలో గత 24 గంటల్లో 49 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అటు రీకవరీ రేటు కూడా పెరిగింది.