
Vedic Clock
Image Credit source: DRAMITMANOHAR
పురాతన భారతీయ సాంప్రదాయ పంచాంగ (సమయ గణన విధానం) ప్రకారం సమయాన్ని తెలుసుకోవడానికి ‘వేద గడియారం’ ప్రారంభోత్సవానికి రెడీ అవుతుంది. ఇలా పంచాంగం ప్రకారం సమయం తెలియజేసేందుకు రూపొందించబడిన ప్రపంచంలోని మొట్టమొదటి వేద గడియారంగా ఖ్యాతి గాంచింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న ఈ వేద గడియారాన్ని నేడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. దీని పేరు ‘విక్రమాదిత్య వేద గడియారం. దీనిని ఉజ్జయినిలోని జంతర్ మంతర్ ప్రాంతంలో 85 అడుగుల టవర్‌పై ఉంచబడింది.
వేద గడియారం లక్షణాలు
- ‘వేద గడియారం’ వేద హిందూ పంచాంగం, గ్రహాల స్థానం, ముహూర్తం, జ్యోతిష్య గణనలు, అంచనాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. IST, GMT సమయాన్ని కూడా తెలియజేస్తుంది.
- గడియారం సంవత్సరం, నెలలు, చంద్రుని స్థానం, పర్వ, శుభ ముహూర్తం, గడియలు, నక్షత్రం, సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం వంటి ఇతర విషయాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రదర్శిస్తుంది.
- గడియారం ఒక సూర్యోదయం నుండి మరొక సూర్యోదయం ఆధారంగా సమయాన్ని గణిస్తుంది.
- “భారత కాల గణన విధానం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది. సూక్ష్మమైనది. స్వచ్ఛమైనది. దోష రహితమైనది. ప్రామాణికమైనది. నమ్మదగినది.
- ఈ అత్యంత విశ్వసనీయమైన వ్యవస్థ ఉజ్జయినిలో విక్రమాదిత్య వేద గడియారం రూపంలో తిరిగి స్థాపించనున్నామని ఒక ప్రకటనలో తెలియజేశారు.
- “ఉజ్జయినిలో ఏర్పాటు చేసిన వేద గడియారం ప్రపంచంలో దేశ దేశాల సమయాన్ని తెలుసుకోవచ్చు.
- అంతేకాదు భారతీయ ఖగోళ సిద్ధాంతం, గ్రహ నక్షత్రరాశుల కదలికల ఆధారంగా భారతీయ సమయ గణనలలో అతి తక్కువ సమయం చేర్చబడుతుంది.
- వేద గడియారం అనేది భారతీయ కాల గణన సంప్రదాయాన్ని పునరుద్ధరించే ప్రయత్నమని పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..