కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో దేశంలోని పర్యాటక, సందర్శన స్థలాలన్ని మూత పడ్డాయి. అయితే మధ్య ప్రదేశ్ అటవీ శాఖ మాత్రం మూత పడిన నేషనల్ పార్కులు, టైగర్ రిజర్వ్‌లను తిరిగి తెరవాలాని నిర్ణయించుకున్నారు. ఇందులో కోసం తేదీలను కూడా విడుదల చేశారు. జూన్ 1 నుంచి తిరిగి నేషనల్ పార్కులు, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లను సందర్శకుల కోసం తెరుస్తున్నట్టు ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి విజయ్ షా ప్రకటించారు.
కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా గడచిన రెండు నెలల నుంచి నేషనల్ పార్కులు, టైగర్ రిజర్వ్‌లను మూసివేశారు. పులులు, చిరుత పులులకు మధ్య ప్రదేశ్ పెట్టింది పేరు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రెండు నెలలుగా నేషనల్ పార్కులు, టైగర్ రిజర్వ్‌లు మూతపడ్డాయి. ఈ పార్కులు, రిజర్వ్‌లను జూన్ 1 నుంచి జూన్ 30 వరకు మళ్లీ తెరవాలని నిర్ణయించినట్లుగా మంత్రి తెలిపారు.
ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో షా ఈ వివరాలను వెల్లడించారు. మళ్లీ ఈ జాతీయ పార్కుల్లో ప్రజలు పర్యాటక కార్యకలాపాల్లో గడిపే విధంగా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు మంత్రి తెలిపారు. అయితే పర్యాటకులు తప్పనిసరిగా కొవిడ్-19 నిబంధనలు పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.