petrol price: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతగా పెరుగుతున్నాయి. రోజు రోజుకీ పెరుగుతోన్న ఇంధన ధరలు వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. వాహనాలను బయటకు తీయాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయి. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ సెంచరీ దాటేసింది. ప్రస్తుతం రూ. 150 వైపు దూసుకుపోతున్నాయి. ఇక డీజిల్ ధరలు కూడా పెట్రోల్‌తో పోటీపడీ మరీ పెరుగుతున్నాయి. కొన్ని ప్రదేశాల్లో డీజిల్ కూడా వందకు చేరువవుతోంది. ఇదిలా ఉంటే ఎన్నడూ లేని విధంగా ధరలు ఈ స్థాయిలో పెరుగుతుండడానికి ఇప్పటి వరకు ఎవరూ సరైన కారణాన్ని చెప్పలేక పోతున్నారు. కొన్నిసార్లు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతోన్నా భారత్‌లో ధరలు మాత్రం తగ్గడం లేదు.
అయితే తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మంత్రి చెప్పిన కారణం వింటే దిమ్మ తిరిగిపోవాల్సిందే. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంపై మీ అభిప్రాయం ఏంటని మీడియా అడిగిన ప్రశ్నకు మధ్యప్రదేశ్ మంత్రి ఓమ్ ప్రకాశ్ శక్లేచా బదులిస్తూ.. ‘జీవితంలో కష్టాలు వస్తేనే.. సుఖం విలువ ఏంటో తెలుస్తుంది. అసలు కష్టమంటే ఏంటో తెలియకపోతే సంతోషాన్ని అనుభవించలేరు’ అంటూ తనదైన శైలిలో స్పందించారు. ఓవైపు ప్రజలు పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతుంటే మంత్రి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమంటూ ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
MP Minister’s bizarre response on fuel prices “Troubles make you realise the happiness of good times. if there’s no trouble, you won’t be able to enjoy happiness @ndtv @ndtvindia @manishndtv @GargiRawat #PetrolPriceHike #PetrolDieselPrice pic.twitter.com/hjUivyepY1
— Anurag Dwary (@Anurag_Dwary) July 11, 2021
జనాభా అదుపు కోసం ‘పాపులేషన్ పాలసీ’ ని లాంచ్ చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..తొమ్మిదేళ్ల టార్గెట్