మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ హంతకుడికి పెరోల్ కోసం తన భార్య వినూత్నమైన అభ్యర్థన చేసింది. శివపురి నివాసి అయిన ఈ మహిళ తన దరఖాస్తులో సుత్తి లేకుండా సూటిగా అభ్యర్థించింది. పెళ్లయి ఏడేళ్లు అవుతున్నప్పటికీ.. గర్భం దాల్చలేదని, తన భర్తతో కలిసి ఎక్కువ కాలం జీవించలేదని వాపోయింది. తాను తల్లి అయ్యేందుకు తన భర్తకు పెరోల్ ఇవ్వాలంటూ జైలు సూపరింటెండెంట్‌ను వేడుకుంది. తమకు వారసులు లేరని, వారసుల కోసం కొద్ది రోజులు తన భర్తకు పెరోల్ ఇవ్వాలంటూ కోరింది.
ఆమె అభ్యర్థనను జైలు సూపరింటెండెంట్ కూడా అంగీకరించారు. నిందితుడి పెరోల్ ఫైల్‌ను పోలీస్ సూపరింటెండెంట్‌కు పపించారు. తనకు పెళ్లి జరిగి ఏడేళ్లు అయ్యిందని, పెళ్లయిన కొద్ది రోజులకే గ్రామంలో ఓ హత్య జరిగిందని పేర్కొంది. అందులో తన భర్త కూడా అరెస్ట్ అవడంతో.. ఆమె ఒంటరైపోయింది. అత్త, మామలు ఇద్దరూ వృద్ధులే కావడంతో వారి పరిస్థితి మరింత ధీనంగా ఉంది. ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్లు కూడా సంతోషంగా ఉంటారని సదరు మహిళ తన దరఖాస్తులో పేర్కొంది. తన భర్త రెండేళ్లకు పైగా జైల్లోనే ఉన్నందున, ప్రవర్తన కూడా బాగానే ఉన్నందున.. పెరోల్‌పై తన భర్తను విడుదల చేసి, తాను తల్లి అవ్వాలనే ఆకాంక్షలను తీర్చుకునే అవకాశం ఇవ్వాలని కోరింది.
మహిళ భర్త జైలులో ఉన్నాడని గ్వాలియర్ సెంటర్ జైలు సూపరింటెండెంట్ విదిత్ సుర్వయ్య తెలిపారు. హత్య, అత్యాచారం వంటి తీవ్రమైన కేసుల్లో నిందితులకు పెరోల్ ఇవ్వాలనే నిబంధన లేదని, అయితే, జిల్లా యంత్రాంగం, పోలీస్ సూపరింటెండెంట్ ఆమోదిస్తే.. ఖైదీని పెరోల్‌పై విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పెరోల్ ఫైల్‌ను ఉన్నతాధికారులకు పంపినట్లు ఆయన తెలిపారు. అక్కడి నుంచి ఆమోదం వస్తే.. ఖైదీకి పెరోల్ లభిస్తుందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..