MP Election: ముఖ్యమంత్రి అభ్యర్థిపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అంగీకరించారు. శుక్రవారం ఆయన సాత్నాలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయం స్పష్టం చేశారు.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అంగీకరించారు. శుక్రవారం ఆయన సాత్నాలో మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ ప్రభుత్వంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా ఉంటానా.. లేక మరెవరైనా ముఖ్యమంత్రి అవుతారా అనేది పార్టీ హైకమాండ్ చూసుకుంటుందన్నారు. వచ్చే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లేదా సత్నా ఎంపీ గణేష్ సింగ్? అని మీడియా అడిగి ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు.
ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం సాత్నా, కట్నీ, జబల్‌పూర్‌లలో బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా భారీ రోడ్ షోలు, ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. జబల్‌పూర్‌లో జరిగిన గత ఎన్నికల సభలో చౌహాన్ ప్రసంగిస్తూ.. ఆయన చేసిన పాపాల భారం వల్లే కమల్‌నాథ్ ప్రభుత్వం పడిపోయిందని అన్నారు. పెళ్ళి కూతుళ్లకు కానుకల సొమ్మునుకూడా మాయం చేశారని సీఎం సంచలన ఆరోపణలు చేశారు. పేదల ముసుగులో పిల్లల ల్యాప్‌టాప్‌లు, కొడుకు, కూతురు పుడితే ఇచ్చే డబ్బులు కూడా ఆగిపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాపాలు మండి కమల్ నాథ్ ప్రభుత్వం పడిపోయిందన్నారు.
ఇక బంటధర్, కమల్‌నాథ్‌ల జోడీ జై, వీరుల జోడీ కాదని, చేను, శ్యామ్‌ల జోడీ అని కాంగ్రెస్‌పై సీఎం మండిపడ్డారు. 1971లో గుల్జార్ దర్శకత్వం వహించిన ‘మేరే అప్నే’ చిత్రంలో ‘శ్యామ్’, ‘చేను’ పాత్రల వంటివారని, షోలేలోని ‘జై’ తరహాలో కాదని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి సీఎం అన్నారు. ఇక ‘వీరు’ లాంటి వాళ్లు స్నేహితుల్లా ఉంటారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి బీజేపీని గెలిపించాలని కోరారు శివరాజ్ సింగ్ చౌహాన్.
కమల్ నాథ్ , దిగ్విజయ్ పేర్లను పేర్కొనకుండా, శివరాజ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు వారిని జై మరియు వీరూ (షోలేలో అమితాబ్ బచ్చన్ మరియు ధర్మేంద్ర పోషించారు) అని పిలుస్తారు, అయితే వారు వాస్తవానికి శ్యామ్ మరియు చేను (మేరే అప్నేలో వినోద్ ఖన్నా మరియు శత్రుఘ్న సిన్హా పోషించారు) పాత్రలు. ఆడతారు), వారు తమ ప్రాంతాలలో ఆధిపత్యాన్ని కొనసాగించడానికి అన్ని సమయాలలో పోరాడుతూ ఉంటారు. వీరు దోపిడీ చేసే వ్యక్తులు. రాష్ట్రాన్ని నాశనం చేశారు కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని దోచుకోనివ్వం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి …