MP Election Exit Poll Result: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరాహోరి పోరు.. ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు ఇవే..
Madhya Pradesh Assembly Elections Exit Poll Results 2023: వచ్చే ఏప్రిల్-మేలో జరిగే సాధారణ ఎన్నికలకు ప్రీ-ఫైనల్‌గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరో మూడు రోజుల్లో వెలువడనున్నాయి. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన ఐదు రాష్ట్రాలు మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణలో అతి పెద్దది మధ్యప్రదేశ్. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం కూడా ఇదే.
Madhya Pradesh Assembly Elections Exit Poll Results 2023: వచ్చే ఏప్రిల్-మేలో జరిగే సాధారణ ఎన్నికలకు ప్రీ-ఫైనల్‌గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరో మూడు రోజుల్లో వెలువడనున్నాయి. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన ఐదు రాష్ట్రాలు మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణలో అతి పెద్దది మధ్యప్రదేశ్. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం కూడా ఇదే. మధ్యప్రదేశ్‌లో కమలం మళ్లీ వికసిస్తుందా? కమల్‌నాథ్‌ను ఓటర్లు జైకొడతారా అన్నది మరో మూడు రోజుల్లో తేలిపోనుంది. అన్ని సర్వేలు కూడా మధ్యప్రదేశ్‌లో క్లోజ్ ఫైట్ ఉంటుందని నిర్థారించాయి. 230 నియోజకవర్గాలున్నాయి మధ్యప్రదేశ్‌లో. 2018 ఎన్నికలతో పోల్చితే పదిహేను రోజుల క్రితం జరిగిన పోలింగ్‌లో ఓటింగ్ పెరిగింది. మొన్నటి ఎన్నికల్లో 77.15 శాతం మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. 2003 నుంచి మధ్యలో రెండేళ్లు మినహాయింపు మధ్యప్రదేశ్‌లో బీజేపీనే అధికారంలో ఉంది. 2018లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా జ్యోతిరాదిత్య సింధియా పార్టీ ఫిరాయింపుతో కమల్‌నాథ్ ప్రభుత్వం కుప్పకూలి బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆ సానుభూతి తమకు ఉందని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో 1766 కోట్ల రూపాయల విలువైన కానుకలు, డ్రగ్స్, నగదు, మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి పేరును ప్రకటించకుండా బీజేపీ వ్యూహాత్మక ప్రచారం చేసింది. తాము గెలిస్తే కమల్‌నాథ్ సీఎం అవుతారని కాంగ్రెస్ ప్రచారం చేసింది. చిన్నా చితకా పార్టీలు బరిలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్యే జరిగింది.
ఎగ్జిట్ పోల్స్ సర్వేలు..
పోల్ స్ట్రాట్: 230 సీట్లు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆధిక్యం ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్‌కే 45.6 శాతం ఓట్లతో 111-121 సీట్లు లభించే అవకాశం ఉందని పోల్ స్టాట్ ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేసింది. బీజేపీ 43.3 శాతం ఓట్లతో 106-116 సీట్లు లభించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.
మాట్రిజ్ : కాంగ్రెస్ 97-107, బీజేపీ 118-130
టూడేస్ చానక్య: కాంగ్రెస్ 74, బీజేపీ 151, ఇతరులు 5
సీఎన్ఎక్స్: కాంగ్రెస్ 111, బీజేపీ 116, ఇతరులు 3
పీపుల్స్ పల్స్ సర్వే: కాంగ్రెస్ 117 – 139, బీజేపీ 91 – 113, ఇతరులు 0 -8
న్యూస్ 18: బీజేపీ -112, కాంగ్రెస్- 113, ఇతరులు- 5
జన్ కీ బాత్ సర్వే: బీజేపీ 100-123, కాంగ్రెస్ 102-125, ఇతరులు 5
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..